Telangana Ration: తెలంగాణలో రేషన్‌ పంపిణీపై క్లారిటీ వచ్చేసింది.. ఎప్పటి నుంచి సరఫరా చేయనున్నారంటే..

|

Jan 04, 2022 | 4:51 PM

Telangana Ration: తెలంగాణ రేషన్‌ వ్యవస్థకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్య కారణంగా తెలంగాణలో రేషన్‌ పంపిణీ ఆగిపోయిన విషయం తెలిసిందే. సాధారణంగా ప్రతి 1,2 లేదా 3 తేదీల్లోపూ రేషన్‌ పంపిణీ జరుగుతుంది. కానీ...

Telangana Ration: తెలంగాణలో రేషన్‌ పంపిణీపై క్లారిటీ వచ్చేసింది.. ఎప్పటి నుంచి సరఫరా చేయనున్నారంటే..
Follow us on

Telangana Ration: తెలంగాణ రేషన్‌ వ్యవస్థకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్య కారణంగా తెలంగాణలో రేషన్‌ పంపిణీ ఆగిపోయిన విషయం తెలిసిందే. సాధారణంగా ప్రతి 1,2 లేదా 3 తేదీల్లోపూ రేషన్‌ పంపిణీ జరుగుతుంది. కానీ తాజాగా సాఫ్టవేర్‌లో సమస్యత తలెత్తడంతో 4వ తేదీన కూడా సరకుల పంపిణీ జరగలేదు. నిజానికి మంగళవారం రేషన్‌ సరకులను పంపిణీ చేయాలని అధికారులు భావించారు కానీ సమస్య పరిష్కరం కాకపోవడంతో ఈరోజు కూడా చేయలేకపోయారు. దీంతో రేషన్‌ సరకుల కోసం ఎదురు చూసే వారు గందరగోళానికి గురయ్యారు.

అయితే తాజాగా ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ వి. అనిల్‌ కుమార్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్య పరిష్కారం కానీ కారణంగా.. మంగళవారం కూడా సరకులను అందించలేకపోయామని తెలిపిన అనిల్‌.. బుధవారం నుంచి పంపిణీ ప్రారంభిస్తామని క్లారిటీ ఇచ్చారు. లబ్ధి దారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రతీ లబ్ధి దారుడికి రేషన్‌ బియ్యం అందుతుందని సాంకేతిక సమస్య కారణంగానే ఆలస్యమైందని వివరించారు.

ఇదిలా ఉంటే కరోనా కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులకు రేషన్‌ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి లబ్ధిదారులకు మొత్తం 10 కిలోల బియ్యాన్ని అందిస్తున్నాయి. గతేడాది జూన్‌లో ప్రారంభమైన ఈ పంపిణీ నవంబర్‌ వరకు కొనసాగించిన కేంద్రం.. ఈ ఏడాది మార్చి వరకు ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించారు. అయితే తెలంగాణలో డిసెంబర్‌లో కేవలం 5 కిలోలు మాత్రమే ఇచ్చారు. కానీ తాజాగా లబ్ధిదారులకు పాత విధానంలోనే భాగంగా 10 కిలోల బియ్యం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. మరి గత నెల ఇవ్వని 5 కిలోలను కలుపుకొని 15 ఇస్తారా.? అన్న విషయం తేలాల్సి ఉంది.

Also Read: సిరి-శ్రీహన్ మధ్య దూరం పెరిగిందా.? వైరల్ అవుతున్న సిరి ప్రియుడి ఇన్‌స్టా పోస్ట్!

PM Kisan: రైతులకు ప్రభుత్వం హెచ్చరిక.. పీఎం కిసాన్‌ డబ్బులు దొంగిలిస్తున్నారు జాగ్రత్త..?

Liger Glimpse-Vijay Devarakonda: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న లైగర్ గ్లింప్స్.. రికార్డ్స్ కొల్లగొడుతున్న రౌడీ విజయ్..