Yadadri Temple: ప్రపంచ దేవాలయాల్లో యాదాద్రి ప్రత్యేకత చాటుకోబోతోంది.. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

|

Mar 12, 2021 | 5:10 PM

Yadadri Temple: యాదాద్రి పునర్నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నాడు సంబంధిత అధికారులతో సమీక్ష..

Yadadri Temple: ప్రపంచ దేవాలయాల్లో యాదాద్రి ప్రత్యేకత చాటుకోబోతోంది.. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
Cm Kcr
Follow us on

Yadadri Temple: యాదాద్రి పునర్నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నాడు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్ణీత గడువులోగా తుదిమెరుగులు దిద్దే పనులు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఏప్రిల్ 15వ తేదీ కల్లా క్యూలైన్ నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. 350 ఫీట్ల క్యూలైన్ నిర్మాణాన్ని ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలని సూచించారు. కాగా, ఈ సమీక్షంలో భాగంగా అధికారులు ప్రదర్శించిన యాదాద్రి లైటింగ్‌పై డెమో వీడియోను ముఖ్యమంత్రి కేసీఆర్ తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రపంచ దేవాలయాల్లో యాదాద్రి తన ప్రత్యేకతను చాటుకోబోతోందని అన్నారు. మే నెలలో యాదాద్రి ఆలయాన్ని పునఃప్రారంభించే అవకాశం ఉందన్నారు. అధికారులు కూడా నిర్మాణల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఇదిలాఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే స్వయంగా పరిశీలించిన విషయం తెలిసిందే. సుమారు ఆరు గంటలకు పైగా ఆలయ ప్రాంగణంతో ఉన్న ఆయన.. ఆలయ నిర్మాణ పనులను ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలించడమే కాకకుండా, అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని నిర్మాణాలన్నింటినీ ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, మార్చి చివరి నాటికి పనులను పూర్తి చేయాలని నాటి పర్యటన సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు.

Also read:

Kangana Ranaut : గాంధీని టార్గెట్‌ చేసిన కంగనా, భార్య, సొంత బిడ్డలను వేధించినట్టు ఆరోపణలున్నాయని కామెంట్

Student Suicide: విజయవాడ కాలేజ్ హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో పేరెంట్స్ గురించి..

క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. రెండు నెలలకు మైదానంలో అడుగుపెట్టిన టీం ఇండియా ఆల్‌రౌండర్..