Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. ఎస్సీ, ఎస్టీ మ‌హిళ‌ల‌కు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సహం..

|

Jul 14, 2021 | 10:26 PM

Telangana Cabinet: సాధారణ ప్రోత్సాహకాలతో పాటు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అవసరమైన

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. ఎస్సీ, ఎస్టీ మ‌హిళ‌ల‌కు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సహం..
Cm Kcr Cabinet (file)
Follow us on

Telangana Cabinet: సాధారణ ప్రోత్సాహకాలతో పాటు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అవసరమైన ప్రోత్సాహకాలను అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం నాడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా, గ్రామీణ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సృష్టించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల అభివృద్ధితో ఆర్థిక కలాపాలు పెరిగి, తద్వారా ఉపాధి పెరిగి, రాష్ట్రంలోని గ్రామీణ, మారుమూల వెనకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్దికి దారి తీస్తుందని కేబినెట్ ఆకాంక్షించింది. అలాగే, గ్రామీణ ఎస్సీ ఎస్టీ మహిళలకు జోన్లల్లో వ్యవస్థాపక అవకాశాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని నిర్ణయించారు. ఇక రాష్ట్రంతో పాటు దేశ విదేశాలకు ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి వీలు కల్పించే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించారు. ఈ ప్రోత్సాహకాల్లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల లో స్థాపించే యూనిట్లకు పలు విధాల రాయితీలను అందించాలని కేబినెట్ నిర్ణయించింది.

కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు..
1) కరెంటు సబ్సిడీని ప్రతి యూనిట్‌కు రెండు రూపాయల చొప్పున 5 సంవత్సరాల దాకా అందించాలని నిర్ణయించారు.
2) పెట్టుబడి కోసం తీసుకున్న టర్మ్ లోన్‌పై చెల్లించాల్సిన మొత్తం వడ్డీలో 75 శాతం వడ్డీని (రెండు కోట్లకు మించకుండా) రీయింబ‌ర్స్ చేయాలని నిర్ణయించారు.
3) మార్కెట్ కమిటీకి చెల్లించాల్సిన ఫీజును, ఏడు సంవత్సరాల కాలం వరకు 100 శాతం రీయింబర్స్‌మెంట్ చేయాలని నిర్ణయించారు.
4) ఆహార ఉత్పత్తులను, స్టోరేజీకి తరలింపు తదితర లాజిస్టిక్స్ కోసం కూడా ఈ జోన్లలో ప్రత్యేకంగా భూమిని కేటాయించి వాణిజ్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలని నిర్ణయించారు.

ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ప్రోత్సాహకాలు..
1) 15 శాతం మూలధనాన్ని (20 లక్షలకు మించకుండా) మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
2) మూలధనం లోన్‌పై చెల్లించాల్సిన వడ్డీలోని 10 శాతం రీయింబ‌ర్స్‌మెంట్ (85 శాతం)( రూ.2 కోట్ల వడ్డీకి మించకుండా) ఇవ్వాలని నిర్ణయించారు.
3) అర్హులైన వారికి జోన్లలో కేటాయించిన భూమి కొనుగోలు ధర మీద 33 శాతం సబ్సిడీ (20 లక్షలకు మించకుండా సబ్సిడీ) ఇవ్వాలని నిర్ణయించారు.

స్వయం సహాయక సంఘాలు, రైతు సంఘాలకు(ఎఫ్ పీ వో ) ప్రోత్సహకాలు..
1) 15 శాతం మూల ధనం మంజూరు (రూ.1 కోటి మించకుండా) చేయాలని నిర్ణయించారు.
2) మూలధనం లోన్‌పై చెల్లించాల్సిన వడ్డీలోని 10 శాతం రీయింబ‌ర్స్‌మెంట్ (80 శాతం)(రూ.2 కోట్ల వడ్డీకి మించకుండా) ఇవ్వాలని నిర్ణయించారు.
3) భూమి విలువ మీద 33 శాతం వరకు సబ్సిడీ (20 లక్షలకు మించకుండా) అందించాలని కేబినెట్ నిర్ణయించింది.

Also read:

RV 400 Bikes: ఎలక్ట్రిక్ బైక్స్‌పై భారీ తగ్గింపు.. రూ. 28,000 తగ్గింపు.. రేపటి నుంచే బుకింగ్స్ ప్రారంభం..

Viral Video: అమ్మ బాబోయ్.. ఈ కోతి ముందు మందుబాబులు బలాదూరే.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Mia Khalifa: మియా ఖలీఫాపై దేశాధ్యక్షుడు సంచలన ఆరోపణలు.. స్వచ్ఛందంగానే చేస్తానని బదులిచ్చిన మాజీ పోర్న్‌స్టార్..