AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Cabinet: గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీపై లేటెస్ట్ అప్డేట్.. త్వరలోనే కేబినెట్ భేటీ..

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 6న సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంపై ప్రధానంగా సమాలోచనలు జరగనున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రెండు ప్రత్యేక బిల్లులను ఆమోదించనున్నారు.

Telangana Cabinet: గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీపై లేటెస్ట్ అప్డేట్.. త్వరలోనే కేబినెట్ భేటీ..
Revanth Reddy
Prabhakar M
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Mar 01, 2025 | 9:09 AM

Share

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 6న సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంపై ప్రధానంగా సమాలోచనలు జరగనున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రెండు ప్రత్యేక బిల్లులను ఆమోదించనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు.. అలాగే.. విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ల కోసం మరో బిల్లు తీసుకురానున్నట్లు పేర్కొంటున్నారు. ఈ రెండు బిల్లులను కేబినెట్ ఆమోదించనున్నారు. అదే విధంగా, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు మరో బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంది.

ప్రధాని మోదీతో భేటీపై నిర్ణయం..

బీసీ రిజర్వేషన్ల బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందిన అనంతరం ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవాలని ప్రభుత్వం యోచిస్తోంది.

అలాగే, రాష్ట్రంలో నిర్వహించిన రెండో విడత కులగణన సర్వే ఫలితాలను కూడా ఈ సమావేశంలో సమీక్షించనున్నారు.

ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీపై చర్చ..

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు ఆర్థిక సాయం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలపై కూడా కేబినెట్ చర్చించనుంది. ఈ నెలలోనే లబ్దిదారులను ఫైనల్ చేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం

ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ఈ నెల రెండో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 10న ప్రారంభం కానుండటంతో, అసెంబ్లీ సమావేశాలను అంతకు ముందే నిర్వహించాలా లేదా అదే సమయంలో ప్రారంభించాలా అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించిన తర్వాత, ప్రధాని మోదీని కలిసి రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో తెలంగాణ బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని చేర్చాలని కోరేలా ప్రణాళిక సిద్ధమవుతోంది.

రాహుల్ గాంధీ భేటీకి హాజరయ్యే అవకాశం

ఈ ప్రక్రియలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా భాగస్వామ్యం కావచ్చనే సమాచారం. కేంద్ర ప్రభుత్వంతో చర్చల అనంతరం, ఈ నెల రెండో వారంలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఈ కేబినెట్ సమావేశం ద్వారా తెలంగాణ రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..