తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐదు గంటల పాటు కొనసాగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం రాత్రి 7 గంటల వరకు సాగింది. ఐదు గంటల పాటు కొనసాగిన సమావేశంలో ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించింది. లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఇచ్చింది.
లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ నిబంధనల సడిలింపు నేపథ్యంలోనే.. ప్రభుత్వ పనిదినాల్లో, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో జరిగే భూములు, ఆస్తుల రిజిష్ట్రేషన్లతో పాటు, రవాణాశాఖ ఆధ్వర్యంలో జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు అనుమతించాలని కేబినెట్ నిర్ణయించింది.