Trs vs Bjp: టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ నయా స్కెచ్‌.. మరి టీఆర్ఎస్ ఎలా ఫేస్ చేస్తుందో..!

Telangana Politics - Trs vs Bjp: తెలంగాణలో అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న బీజేపీ.. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు..

Trs vs Bjp: టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ నయా స్కెచ్‌.. మరి టీఆర్ఎస్ ఎలా ఫేస్ చేస్తుందో..!
Bjp New Plans
Follow us
TV9 Telugu

| Edited By: Shiva Prajapati

Updated on: Feb 10, 2022 | 9:46 PM

Telangana Politics – Trs vs Bjp: తెలంగాణలో అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న బీజేపీ.. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు వరుస కార్యక్రమాలను రూపొందిస్తూనే ఉంది. ఈ మధ్య టీఆర్ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు వినూత్న కార్యక్రమాలకు తెరలేపాలని, ప్రజల్లోకి బలంగా పోయే విధంగా వ్యూహాలు ఉండాలని భావిస్తున్నారు కమలం ముఖ్య నేతలు. అయితే, ప్రజలను చైతన్య పరిచే విధంగా ఎలాంటి కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుందనే విషయంలో సమగ్ర ఆలోచనలో ఉన్నారంట రాష్ట్ర బీజేపీ నేతలు.

అవన్నీ కామన్.. కొత్తగా ఏంటంటే.. ప్రెస్ మీట్లు, బ‌హింర‌గ స‌భ‌లు, పాద‌యాత్రలు, దీక్షలు, ధ‌ర్నాలు ఇలాంటి కార్యక్రమాలు రాజ‌కీయ పార్టీలు చేయ‌డం స‌హాజం. కానీ బీజేపీ నేత‌లు ఇప్పుడు తెలంగాణలో విన్నూత కార్యక్రమాల‌కు శ్రీకారం చుట్టాల‌ని అనుకుంటున్నారు. తెలంగాణలో అధికారం ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్న క‌మ‌లం పార్టీ నేత‌ల‌కు, టీఆర్ఎస్ నేత‌ల‌కు ప‌చ్చగడ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత వైరం పెరిగింది. ప‌రస్పర అరోప‌ణలతో నువ్వా-నేనా అన్న చందంగా మాట‌ల యుద్ధానికి నేత‌లు దిగుతుంటే, క్షేత్ర స్థాయిలో కార్యక‌ర్తలు కొట్టుకునే స్థాయికి దిగుతున్నారు. అయితే ఇవి ఇలా కొన‌సాగిస్తునే టీఆర్ఎస్ ను బ‌ల‌హీనప‌రిచే కార్యక్రమం చేయాల‌ని క‌మ‌లం పార్టీ నేత‌లు అలోచిస్తున్నారు.

రచ్చబండల పేరుతో.. రానున్న రోజుల్లో రచ్చబండ‌ల పేరుతో తెలంగాణ గ్రామీణ స‌మ‌స్యలు తెలుసుకోవ‌డం.. టీఆర్ఎస్ నేత‌ల హామీల వీడియోలు ప్రతి గ్రామంలో ప్రదర్శించడం, కర‌ప‌త్రాలు, డ‌ప్పుల‌తో చాటింపులు వేయ‌డం వంటి పాత ప‌ద్ధతులను వాడుకోవాల‌ని ఆలోచిస్తున్నారు బీజేపీ నేతలు. ముఖ్యంగా ద‌ళిత, గిరిజ‌న వాడ‌ల్లోకి బీజేపీ వెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ ఆలోచిస్తోంది. రాత్రి నిద్రలతో మ‌రికొన్ని కార్యక్రమాలు ఉంటాయ‌ని బీజేపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ద‌ళిత బంధు, మూడు ఎక‌రాల భూమి వంటి అంశాల‌తో ఇలాంటి కార్యక్రమాలు రూపోందిచాల‌ని చూస్తున్నారు బీజేపీ నేత‌లు.

సోషల్ మీడియా కూడా.. విన్నూత ప్రచారంతో సోష‌ల్ మీడియా టీమ్‌లో కూడ కొత్త వ్యూహాలు అనుస‌రించాల‌ని అనుకుంటుంది బీజేపీ. మరోవైపుకమలం నేతల ప్రయత్నాల‌ను టీఆర్ఎస్ కూడ ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా ప్లాన్ చేసుకుంటుంది. మొత్తానికైతే రానున్న రోజుల్లో రెండు పార్టీల మ‌ధ్య ఈ ఫైట్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని మాత్రం అవగతమవుతోంది.

Also read:

Andhra Pradesh: అనంతను ఊపేస్తున్న కొత్త జిల్లాల రచ్చ.. ఆ నాలుగు జిల్లాల కోసం పెరుగుతున్న డిమాండ్లు..

Trs vs Bjp: తెలంగాణలో ఆసక్తికర రాజకీయం.. బీజేపీ తప్పటడుగులు, స్పీడ్ పెంచుతున్న టీఆర్ఎస్‌..

Minister Harish Rao: తెలంగాణ అంటే బీజేపీకి కడుపు నిండా విషమే.. సంచలన కామెంట్స్ చేసిన మంత్రి హరీష్ రావు..