Telangana: సెప్టెంబర్‌ 17 ప్రోగ్రామ్స్‌పై బీజేపీ వ్యూహరచన.. 4రోజుల ముందు నుంచే

Telangana: సెప్టెంబర్‌ 17పై ఫుల్‌ ఫోకస్‌ పెడుతోంది టీబీజేపీ. కేవలం ఆ ఒక్కరోజుకే పరిమితం కాకుండా నాలుగు రోజుల ముందు నుంచే హడావిడి చేయాలని ప్లాన్‌ చేస్తోంది.

Telangana: సెప్టెంబర్‌ 17 ప్రోగ్రామ్స్‌పై బీజేపీ వ్యూహరచన.. 4రోజుల ముందు నుంచే
Bjp

Updated on: Sep 11, 2022 | 6:05 AM

Telangana: సెప్టెంబర్‌ 17పై ఫుల్‌ ఫోకస్‌ పెడుతోంది టీబీజేపీ. కేవలం ఆ ఒక్కరోజుకే పరిమితం కాకుండా నాలుగు రోజుల ముందు నుంచే హడావిడి చేయాలని ప్లాన్‌ చేస్తోంది. ఇంతకీ, వ్యూహామేంటి? ఏమేం చేయాలనుకుంటోంది?.. 2023లో అధికారమే లక్ష్యం, అందుకోసం అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటోంది తెలంగాణ బీజేపీ. ఇప్పుడు సెప్టెంబర్‌ 17, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అందుకు వేదికగా మార్చుకుంటోంది కాషాయదళం. కేవలం ఆ ఒక్కరోజే సెలబ్రేషన్స్‌కు పరిమితం కాకుండా, మూడు నాలుగు రోజుల ముందు నుంచే ప్రోగ్రామ్స్‌ కండక్ట్‌ చేస్తూ జనంలోకి వెళ్లేందుకు వ్యూహరచన చేస్తోంది. సికింద్రాబాద్‌లో సమావేశమైన మెయిన్‌ లీడర్స్‌, తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఎలా జరపాలి? పార్టీపరంగా ఏం చేయాలో చర్చించారు. సెప్టెంబర్‌ 17కి ముందు సన్నాహక ప్రోగ్రామ్స్‌ చేపట్టాలని నిర్ణయించారు. స్టేట్‌ వైడ్‌గా బైక్‌ ర్యాలీలు నిర్వహించి, సెప్టెంబర్‌ 17న గ్రామగ్రామాన జెండా వందనం చేపట్టనున్నారు. అలాగే, పల్లెల్లో పోరాట స్ఫూర్తిని నింపేలా బురుజులను అలంకరించాలని కేడర్‌కు పిలుపునిచ్చింది బీజేపీ.

స్వాతంత్ర్య సమరయోధులు, నిజాం అండ్ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధులు, వాళ్ల కుటుంబాలను ఇన్వాల్వ్‌ చేయాలనుకుంటోంది బీజేపీ. అందుకోసం యోధుల కుటుంబాలను కలుస్తున్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్ మండలం పోచారంలో స్వాతంత్ర్య సమరయోధుడు షాయుబుల్లాఖాన్‌ ఫ్యామిలీని కలిశారు కిషన్‌. సెప్టెంబర్‌ 17న బీజేపీ నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. అలాగే, హైదరాబాద్‌ గోషామహల్‌లో మరో స్వతంత్ర సమరయోధుడు వందేమాతరం రామచందర్‌రావు కుటుంబ సభ్యులను కలిసి సన్మానించారు కిషన్‌రెడ్డి. అధికారికంగా, పార్టీపరంగా ప్రోగ్రామ్స్‌ కండక్ట్‌ చేస్తున్నప్పటికీ, అవన్నీ ప్రజా కార్యక్రమల్లా ఉండేలా జాగ్రత్తపడుతోంది బీజేపీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..