Bandi Sanjay: మునుగోడుకు బయలుదేరిన బండి సంజయ్‌.. అడ్డుకున్న పోలీసులు.. అర్ధరాత్రి తోపులాట

తెలంగాణలో రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో కాకరేపుతున్న మునుగోడు ఉప ఎన్నికకు గురువారం పోలింగ్‌ జరుగనుంది. ఇక మునుగోడులోనే మంత్రులు,..

Bandi Sanjay: మునుగోడుకు బయలుదేరిన బండి సంజయ్‌.. అడ్డుకున్న పోలీసులు.. అర్ధరాత్రి తోపులాట
Bandi Sanjay

Updated on: Nov 03, 2022 | 5:57 AM

తెలంగాణలో రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో కాకరేపుతున్న మునుగోడు ఉప ఎన్నికకు గురువారం పోలింగ్‌ జరుగనుంది. ఇక మునుగోడులోనే మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్నా.. ఎన్నికల కమిషన్‌ పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌ నుంచి మునుగోడుకు బయలుదేరగా, పోలీసులు పలు ప్రాంతాల్లో అడ్డుకున్నారు. పోలీసులకు- బీజేపీ కార్యకర్తలకు మధ్య కొంత తోపులాట జరిగింది. ముందుగా మలక్‌పేట వద్ద అడ్డుకున్నా.. సంజయ్‌ ముందుకెళ్లారు. మరోసారి వనస్థలిపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తల సహకారంతో సంజయ్‌ కాన్వాయ్‌ ముందుకు సాగింది.

అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద జాతీయ రహదారిపై తమవాహనాలు ఉంచి పోలీసులు ఆపారు. దీంతో బీజేపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. జాతీయ రహదారిపై వాహణాల రాకపోకలు నిలిచిపోయాయి. కొంత సేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో బండి సంజయ్‌ని పోలీసులు అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇలా ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగుతున్న వేల పోలీసులు మరింతగా బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి సంఘనటుల చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి