Basara IIIT Student Missing: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి మిస్సింగ్.. ఏం జరిగిందో..?

|

Jul 11, 2023 | 6:55 AM

బాసర ఆర్జీయూకేటీలో ట్రిపుల్ ఐటీ చదువుతున్న ఓ విద్యార్ధి అదృశ్యమయ్యాడు. ఇంటికి వెళ్తున్నానని చెప్పిన విద్యార్ధి మూడు రోజులుగా కనిపించకపోవడంతో..

Basara IIIT Student Missing: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి మిస్సింగ్.. ఏం జరిగిందో..?
Basara IIIT Student Banni
Follow us on

తూప్రాన్‌: బాసర ఆర్జీయూకేటీలో ట్రిపుల్ ఐటీ చదువుతున్న ఓ విద్యార్ధి అదృశ్యమయ్యాడు. ఇంటికి వెళ్తున్నానని చెప్పిన విద్యార్ధి మూడు రోజులుగా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకెళ్తే..

మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం నర్సంపల్లికి చెందిన కత్తుల పద్మ, వెంకటేశ్‌ దంపతుల రెండో కుమారుడు బన్ని (19) నిర్మల్‌ జిల్లా ట్రిపుల్‌ ఐటీ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బన్నీ తన స్నేహితులతో తన తండ్రి మాదిరిగా కాలేజీ యాజమన్యానికి ఫోన్‌ చేయించి కొడుకును ఇంటికి పంపించాలని చెప్పించాడు. అనంతరం జులై 6వ తేదీన కాలేజీ యాజమన్యం వద్ద అవుట్‌పాస్‌ తీసుకుని గురువారం బాసర రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు.

ఐతే తరువాత రోజు బన్నీకి తల్లిదండ్రులు ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు వారు సోమవారం (జులై 10) యూనివర్సిటీకి వచ్చి ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. బన్నీ ఇంటికి వెళ్తున్నానని చెప్పి 3 రోజుల క్రితమే హాస్టల్‌ నుంచి బయటికి వెళ్లినట్లు యాజమన్యం తెల్పింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాసర రైల్వే స్టేషన్‌కు వచ్చిన బన్నీ మహారాష్ట్ర వైపు వెళ్లే కాచిగూడ- మన్మడ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.