Telangana BJP: ఈ నెల 21 నుంచి పల్లె ‘గోస – బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీలు.. నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు వీరే..

|

Jul 16, 2022 | 8:03 AM

ఈ నెల 21 నుంచి నిర్వహించనున్న పల్లె గోస.. బీజేపీ భరోసా బైక్‌ ర్యాలీలకు సంబంధించి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 మంది సీనియర్‌ నేతలను ఇన్‌చార్జీలుగా నియమిస్తూ పార్టీ ప్రకటన విడుదల చేసింది.

Telangana BJP: ఈ నెల 21 నుంచి పల్లె ‘గోస - బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీలు.. నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు వీరే..
Telangana Bjp
Follow us on

Palle Gosa – BJP Bharosa: తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి ‘పల్లె గోస.. బీజేపీ భరోసా’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీజేపీ ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో ప్రతీనెల 20 రోజులు ‘ప్రజాసంగ్రామయాత్ర’, పదిరోజులపాటు ‘పల్లె గోస – బీజేపీ భరోసా’ పేరిట బైక్‌ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ విధంగా పాదయాత్ర, బైక్‌ ర్యాలీలను ఒకదాని తర్వాత మరొకటి ఒక క్రమపద్ధతిలో కొనసాగించనున్నారు. ఇలా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు నిరంతరం ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణను జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ఖరారు చేశాయి. ఇందులో భాగంగా ఈ నెల 21 నుంచి నిర్వహించనున్న పల్లె గోస.. బీజేపీ భరోసా బైక్‌ ర్యాలీలకు సంబంధించి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 మంది సీనియర్‌ నేతలను ఇన్‌చార్జీలుగా నియమిస్తూ పార్టీ ప్రకటన విడుదల చేసింది.

తొలి విడత పల్లె గోస – బీజేపీ భరోసా బైక్‌ ర్యాలీ ముగిసిన తర్వాత ఆగస్టు 2 నుంచి బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్‌ పాదయాత్ర-3 మొదలుకానుంది. ఇరవై రోజుల తర్వాత ఈ పాదయాత్ర ముగియగానే రెండోవిడత బైక్‌ర్యాలీ కొనసాగనుంది. ఈ మేరకు బైక్‌ర్యాలీలో పాల్గొనే నేతలతో శుక్రవారం రాత్రి రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జీ తరుణ్‌ చుగ్‌, బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్యనేతలతోపాటు ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు పాల్గొననున్నారు.

నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లు..

ఇవి కూడా చదవండి

జుక్కల్ నియోజకవర్గం – వివేక్ వెంకటస్వామి, దేవరకద్ర – ఈటల ఎమ్మెల్యే రాజేందర్, ఆదిలాబాద్​- ఎంపీ అర్వింద్, మంచిర్యాల – ఎంపీ సోయం బాపురావు, వేములవాడ – యెండల లక్ష్మీ నారాయణ, బోధన్​- ఎమ్మెల్యే రాజాసింగ్, సిద్దిపేట – మురళీధర్ రావు, తాండూర్​- డీకే అరుణ, మేడ్చల్​- జితేందర్ రెడ్డి, షాద్​నగర్​- కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కల్వకుర్తి – బాబు మోహన్, నర్సంపేట్​- ఎమ్మెల్యే రఘునందన్ రావు, వనపర్తి – ఎంపీ లక్ష్మణ్, కొత్తగూడెం – గరికపాటి మోహన్ రావు పాల్గొంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి