Telangana Assembly Polls 2023 Live Voting Day News Updates in Telugu: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్‌లోఉన్న వారికి ఎన్నికల సంఘం అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది డీఆర్సీ కేంద్రాలకు చేరుకోగా వారికి అధికారులు ఈవీఎంలు, ఇతర సామాగ్రిని అందజేశారు. సామాగ్రిని తీసుకుని బుధవారం సాయంత్రంలోగా సిబ్బంది తమతమ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పలు డీఆర్‌ఎసీ కేంద్రాలను ఆయా జిల్లా ఎన్నికల అధికారులు పరిశీలించి , సిబ్బందికి సూచనలు చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల విధుల్లో 1.85 లక్షల మంది సిబ్బంది, 19,375 ప్రాంతాల్లో 35,356 పోలింగ్ కేంద్రాలు, 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, పోలింగ్ కేంద్రాల పరిశీలనకు 22వేల మైక్రోఅబ్జర్వర్‌లు ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగింది. దాదాపు 1.85 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19,375 ప్రాంతాల్లో 35,356 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. అందులో 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన కోసం 22 వేల మంది మైక్రో అబ్జర్వర్‌లను, స్క్వాడ్‌లను నియమించారు. 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు.
రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. మొత్తం 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఎన్నికల భద్రతా విధుల కోసం రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలను కూడా అధికారులు రంగంలోకి దించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ పూర్తయిన తర్వాత..డిసెంబర్ 3న ఓట్లను లెక్కించి ఫలితాలను వెలువరించనున్నారు.
— ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓటింగ్ కోసం ఇంకా పోటెత్తున్న ఓటర్లు
— సిర్పూర్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఖానాపూర్..
— ..ముదోల్‌లో పోలింగ్‌కి మరో 3 నుంచి 5గంటల సమయం
— ఆదిలాబాద్ 273 , మంచిర్యాల 83 , 259 , 260 బూత్‌లలో వందలసంఖ్యలో ఓటర్లు
— సా.4.45 తర్వాత ఒక్కసారిగా వందల్లో తరలివచ్చిన ఓటర్లు
— క్యూలైన్‌లోకి కాకుండా బూత్‌లోకి ఎగబడిన ఓటర్లు
— కట్టడి చేసేందేకు లాఠీలు ఝుళిపించిన పోలీసులు
— మధిర మున్సిపాలిటీ పరిధిలో బారులు తీరిన ఓటర్లు
— మధిరలోని హరిజనవాడ పోలింగ్ కేంద్రంలో వందల్లో జనం
— పోలింగ్ ముగియడానికి మరో 4గంటలు పట్టే అవకాశం
— ఆఖరి క్షణాల్లో తరలివచ్చిన పబ్లిక్
ఆరా మస్తాన్ ప్రీ పోల్ సర్వే ప్రకారం.. తెలంగాణలో BRSకు 41-49, కాంగ్రెస్‌కు 58-67, బీజేపీ 5-7, ఇతరులు 7 నుంచి 9 వరకు రావచ్చని ఉంది. పార్టీల వారీగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ 39.58 శాతం, కాంగ్రెస్ 41.13 శాతం, బీజేపీ 10.47, ఇతరులకు 8.82 శాతం లెక్కన ఓట్ల శాతాలు ఉన్నట్లు ఆరా సంస్థ వెల్లడించింది.
మలక్‌పేట కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి. మలక్‌పేట సలీంనగర్ పోలింగ్ బూత్ 204 లో ఓటు వేశారు. ప్రపంచంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అద్భుతమైనదని, ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో ఎన్నికలు గొప్పగా, పండుగలా జరుపుకుంటామని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు ఓటు వినియోగించుకోవాలని అన్నారు.
మల్కాజ్‌గిరి, ఇబ్రహీంపట్నంలో చిన్నచిన్న గొడవలు జరిగాయన్నారు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్. గొడవ మొదలైన వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారన్నారు. రాచకొండ పరిధిలో మొత్తం 9,000 మంది పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నట్టు తెలిపారాయన.
చివరి 30 నిమిషాల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల పరుగులు
ఆదిలాబాద్, ఖానాపూర్, నిర్మల్, బోథ్, ముథోల్‌లోని పోలింగ్ కేంద్రాల్లో క్యూకట్టిన ఓటర్లు
పలుచోట్ల అధికారులకి ఎలక్షన్ ఏజెంట్ల మధ్య గొడవ
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందే ముగిసిన పోలింగ్
సా.5లోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటింగ్‌కు అవకాశం
ఆదివారం తేలనున్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని ఏడూళ్ళ బయ్యారంలో ఉద్రిక్తత
పోలింగ్ పరిశీలించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు
జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేసిన మహిళా కార్యకర్తలు
బూటు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన రేగా కాంతారావు
కాంతారావును చుట్టుముట్టిన స్థానికులు
బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం
ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు
కొద్ది నిమిషాల్లో మగియనున్న తెలంగాణ ఎన్నికల పోలింగ్
త్వరపడాలని చాటింపు వేయిస్తున్న ఎన్నికల సంఘం
Calling out loud !
A traditional way of appealing to voters to visit polling stations and cast their vote.#ECI #AssemblyElections2023 #TelanganaElections2023 #GoVote #IVote4Sure pic.twitter.com/99zBhuoIMc
— Election Commission of India (@ECISVEEP) November 30, 2023
గ్రేటర్ హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సీఈఓ వికాస్ రాజ్
హైదరాబాద్ పరిధిలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్
వెబ్ కాస్టింగ్‌ను పరిశీలించిన తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్
హైదరాబాద్ పరిధిలో 1,800 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
నాంపల్లి, గోషామహల్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎలక్షన్ కమిషన్
తెలంగాణ వ్యాప్తంగా సాయంత్రం 5గంటలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ భద్రత మధ్య పోలింగ్ కొనసాగుతోంది. పాతబస్తీలోనూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఉదయం నుంచి పాతబస్తీలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
తెలంగాణలో 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందే ముగిసిన పోలింగ్
చెన్నూర్, బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్
మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్
సాయంత్రం 4గంటల లోపు క్యూలైన్లలో ఉన్నవారికి మాత్రమే ఓటింగ్‌కు అవకాశం కల్పించారు ఎన్నికల సంఘం అధికారులు.
నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓటు వేసే సమయంలో ఎన్నికలం సంఘం నిబంధనలు ఉల్లంఘించడంతో కేసు నమోదు చేశారు అధికారులు. అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా ఎల్లపెల్లిలో పార్టీ కండువాతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఎన్నికల అధికారుల ఫిర్యాదుతో నిర్మల్ గ్రామీణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కమలాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన సతీమణి జమునతో కలిసి వెళ్లి ఓటు ఓటు వేశారు ఈటెల. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, హుజూరాబాద్ నియోజకవర్గాల నుంచి ఈటెల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తున్నారు ఈటెల.
సిద్దిపేట జిల్లాలో విషాదం
సిద్దిపేట జిల్లాలో ఓటు వేసి ఇంటికి వెళ్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి.
సిద్దిపేటలోని భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలో ఘటన.
ఓటు వేసి నడుచుకుంటూ వెళ్తూ గుండెపోటుతో స్వామి(54) మృతి.
ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చిన స్వామి.
స్వామి హఠాన్మరణంతో గ్రామంలో అలుముకున్న విషాదఛాయలు
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 51.89 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. ఇంక గంటన్నర మాత్రమే సమయం ఉండడంతో ఓటు వేయని వారు త్వరగా పోలింగ్ బూత్‌లకు వచ్చి, ఓటేయాలని ఎన్నికల అధికారులు సూచించారు.
మక్తల్ నియోజకవర్గం వర్కుర్ గ్రామంలో టెన్షన్ టెన్షన్
పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్
రామ్మోహన్‌తో పాటు వెళ్తోన్న అనుచరుల్ని అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు
బీఆర్‌ఎస్-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం
తీవ్ర వాగ్వాదంతో పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన రామ్మోహన్
కొడంగల్ నియోజకవర్గంలోని రేగడి మైలారంలో ఉద్రిక్తత
బీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌కు వ్యతిరేకంగా నినాదాలు
కాంగ్రెస్ కార్యకర్తలకు పోటీగా నినాదాలు చేసిన బీఆర్‌ఎస్ శ్రేణులు
ఇరుపార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట
పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగిన గొడవ
పాలేరు ఓటు వెయ్యలేకపోయిన సీపీఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం
ఇటీవలే హైదరాబాద్ నుంచి సొంతూరు తెల్దారుపల్లికి ఓటు మార్చుకున్న తమ్మినేని వీరభద్రం.
ఓటరు ఐడీలో తప్పుల కారణంగా ఓటు వెయ్యలేకపోయిన తమ్మినేని
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంకేశ్వరంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. కర్రలు, రాళ్లతో జరిగిన పరస్పర దాడిలో ఇరుపార్టీల కార్యకర్తలు గాయపడ్డారు. కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నారాయణతండాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ బూత్‌లోకి వచ్చి ప్రచారం చేస్తున్నారని రెండు పార్టీల కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలంలోని కాగితపు రామచంద్రపురం గ్రామంలో ఓటు వేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసిన ఓటరుపై కేసు..
ఓటు హక్కును వినియోగించుకుంటూ పోలింగ్ బూత్ లో ఓటు వేస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని వాట్సప్ స్టేటస్ పెట్టిన ఓటరు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘన క్రింద కేసు నమోదు.
పోలింగ్ బూత్ లో సెల్ ఫోన్ నిషేదం అనే నిబంధన.
బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
డోర్నకల్ మండలం మల్లయ్యకుంటతండాలోని 247 పోలింగ్ కేంద్రం దగ్గర తన్నుకున్న కార్యకర్తలు
ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
1. తెలంగాణ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వగ్రామం చింతమడకలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ కూడా వచ్చారు. ఆమె కూడా అదే కేంద్రంలో తన ఓటు వేశారు.
2 కొడంగల్‌లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సతీసమేతంగా ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండలో ఓటేశారు. ఖమ్మం జిల్లా మధిరలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క.
3. మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని నందినగర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేటలో సతీసమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు మంత్రి హరీష్‌రావు.
4. హైదరాబాద్ రామ్‌నగర్‌లో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడ ఓటు హక్క ఉపయోగించుకున్నారు. ఎంపీ బండి సంజయ్ కరీంనగర్‌లో ఓటు వేశారు
5 జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు. ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
6. వరంగల్ జిల్లా పర్వతగిరిలోని 265 పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సూర్యాపేటలోని చైతన్య స్కూల్‌లో కుటుంబ సమేతంగా ఓటేశారు మంత్రి జగదీశ్ రెడ్డి.
7. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మాజీమంత్రి దామోదర్ రెడ్డి సూర్యపేటలో ఓటు వేశారు
8. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓటువేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. తార్నాకలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మల్కాజ్ గిరి బిజెపి అభ్యర్థి రాంచందర్ రావు.
9 కూకట్‌పల్లి నియోజకవర్గం శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాలులో ఓటు హక్కును వినియోగించుకున్నారు బిఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు. కుటుంబ సమేతంగా వచ్చి తమఓటు హక్కు వినియోగించుకున్నారు శేరిలింగంపల్లి బిఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ.
— మక్తల్ నియోజకవర్గం వర్కుర్ గ్రామంలో టెన్షన్ టెన్షన్
— పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్
— రామ్మోహన్‌తో పాటు వెళ్తోన్న అనుచరుల్ని అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు
— బీఆర్‌ఎస్-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం
— తీవ్ర వాగ్వాదంతో పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన రామ్మోహన్
తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంట వరకూ 36.68 శాతం పోలింగ్
అత్యధికంగా మెదక్‌లో 50.80శాతం.. గద్వాల్‌లో 49.29శాతం పోలింగ్ నమోదు
హైదరాబాద్‌లో అత్యల్పంగా 20.79 శాతం పోలింగ్
ఆలేరు మండలం కొలనుపాకలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు..బీఆర్‌ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త యత్నించారు. దీంతో మహేందర్‌రెడ్డిని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. మహేందర్‌రెడ్డి కారుపై రాళ్లతో దాడి చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వగ్రామం చింతమడకలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. చింతమడకలోని KVRS జిల్లా పరిషత్ హైస్కూల్‌లోని పోలింగ్ సెంటర్‌లో ఓటు వేశారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ కూడా వచ్చారు. ఆమె కూడా అదే కేంద్రంలో తన ఓటు వేశారు. సీఎం వెంట సిద్దిపేట BRS అభ్యర్థి హరీష్ రావు కూడా ఉన్నారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ రాచకొండ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. పలు కేంద్రాలలో ఓటు వేయడానికి వచ్చిన వృద్ధులు, వికలాంగులు.. పోలింగ్ కేంద్రాలకు వచ్చినా ఓటు వేయలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తులకు ఎన్నికల విధుల్లో ఉన్న రాచకొండ పోలీసులు దగ్గరుండి వారి చేత ఓటు వేయడానికి సహాయం చేస్తున్నారు..
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో స్వల్ప ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్ రెడ్డి కండువా వేసుకుని పోలింగ్ బూత్‌కి వెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అడ్డుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి కారుపై రాళ్లతో దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు.
ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు. ఈ సందర్భంగా అందరూ తప్పకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇళ్ల నుంచి ఓటర్లు అందరూ బయటకు వచ్చి ఓటు వేయాలన్నారు. అభివృద్ధి కొనసాగాలి, మన ఉద్యోగాలు మంచిగా చేసుకుంటూ ప్రశాంతమైన జీవితం గడపాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు విజయ్ దేవరకొండ.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్. జూపల్లి రామేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఓటేశారు రామేశ్వరరావు. ఓటు వేసిన అనంతరం సిరా మార్క్ ను చూపించిన ఆయన.. ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఈవీఎంలు మొరాయించాయి. ద్వారకానగర్ శ్రీ సరస్వతి శిశు మందిర్ హైస్కూల్ వద్ద గల పోలింగ్ బూత్ నెంబర్ 63 లో గత రెండు గంటలుగా ఏవీఎం మొరాయించారు. దీంతో టెక్నికల్ టీమ్‌కు ఫిర్యాదు చేశారు ఎన్నికల అధికారులు. అయితే అప్పటి వరకు క్యూ లైన్‌లో వేచి ఉన్న ఓటర్లు పోలింగ్ బూత్ నుండి ఓట్లు వేయకుండానే ఇళ్లకు వెళ్లిపోయారు.
ఖమ్మం జిల్లా మధిరలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క. మంచి ప్రభుత్వాన్ని ఎన్నికోవడానికి ఓటర్లంతా పోలింగ్‌లో పాల్గొవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు భట్టి.
పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువే కనిపిస్తోందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ అన్నారు. సాయంత్రం కల్లా పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకట్రెండు చోట్ల చిన్నపాటి ఘర్షణలు తప్ప మొత్తంగా తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా వచ్చి ఓటేస్తుండటంపై వికాస్‌రాజ్ సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల ఉల్లంఘనకు సంబంధించి చాలా ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించి కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.
హీరో రాజేంద్ర ప్రసాద్ తన కుటుంబంతో కలిసి వేటు వేసేందుకు వచ్చారు.. యువ హీరో విజయ్ దేవరకొండ జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ స్టేషన్‌కు వచ్చి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు..
మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ఇలా..
పెద్దపల్లి జిల్లా మంథనిలో 51.4 శాతం
సంగారెడ్డిలో 37.85శాతం
సంగారెడ్డి నారాయణఖేడ్‌లో 45.43శాతం
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజవర్గంలో 43.70శాతం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ 42.73 శాతం
నల్లగొండ దేవరకొండ 33శాతం
నాగార్జున సాగర్ 40శాతం
మిర్యాలగూడ 39శాతం
నల్గొండ 41శాతం
మునుగోడు 42శాతం
నకిరేకల్ 39శాతం
సిద్దిపేట 44శాతం
దుబ్బాక 48శాతం
గజ్వేల్ 42శాతం
మెదక్ 50 శాతం
సూర్యాపేట 36శాతం
ఆలేరు 47శాతం
తుంగతుర్తి 52శాతం
కోదాడ 38శాతం
ముథోల్ 43శాతం
బోథ్ 48 శాతం
పటాన్‌చెరు 44 శాతం
ఖానాపూర్ 43 శాతం
మానకొండూరు 44 శాతం
సిరిసిల్ల 42 శాతం
వేములవాడ 35 శాతం
కొరుట్ల 44 శాతం
జగిత్యాల 46
ధర్మపురి 45 శాతం
ఆసిఫాబాద్ 40 శాతం
సంగారెడ్డి 42 శాతం
బెల్లంపల్లి 46 శాతం
అధికార పార్టీ బీఆర్ఎస్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఫిర్యాదు.
బీఅర్ఎస్ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అంటూ ఈసీకి ఫిర్యాదు.
నియోజకవర్గాల్లో వంద నుంచి రెండు వందల మంది బీఅర్ఎస్ నేతలు గుమికూడుతున్నారని లేఖలో పేర్కొన్న కేంద్ర మంత్రి.
బీజేపీ నేతలు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని అధికారులు తీరుపై ఆగ్రహం
జనగామలో జరిగిన ఒక ఘటనను ఉదాహరణగా పేర్కొన్న కిషన్ రెడ్డి.
చాలా నియోజకవర్గాల్లో బీఅర్ఎస్ నేతలకు అధికారులు పరోక్ష సహకారం అందిస్తున్నారంటూ ఫిర్యాదు.
అంబర్‌పేట్ నియోజకవర్గంలో బీఅర్ఎస్ అభ్యర్థి తనయుడు డబ్బులు పంచినా, ఆయనపై చర్యలు తీసుకోవడంలో విఫలం అంటూ ఫిర్యాదు.
ఎగ్జిట్ పోల్ సమయాన్ని మార్చిన కేంద్ర ఎన్నికల సంఘం
సాయంత్రం 5.30గంటలకే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకునేందుకు అనుమతి ఇచ్చిన ఈసీ
సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ కూడా తెలంగాణ పోలింగ్‌తో ముగుస్తుంది.
తెలంగాణతో పాటు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పే సర్వేల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నల్గొండ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల బోయవాడ పోలింగ్ కేంద్రం బూత్ నెంబర్102లో ఓటు హక్కు వినియోగించుకున్న 18 మంది ట్రాన్స్ జెండర్లు. అటు కరీంనగర్ పట్టణంలోని సుభాష్ నగర్ పోలింగ్ స్టేషన్ నెంబర్191లో ట్రాన్స్‌జెండర్స్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు:
కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో తన ఓటు హక్కు వినియోగించుకున్న స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క ఫేం శిరీష.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మావోయిస్టులు కలకలం రేపారు. చర్ల మండలం అంజనాపురం వెళ్లే రహదారిలో పోలీసులే టార్గెట్‌గా IED అమర్చారు మావోయిస్టులు. డాగ్ స్క్వాడ్ బృందాలు IEDని కనుగొనడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతంలో కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి.
తెలంగాణలో ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు జనం. అంబర్‌పేట్ నియోజకవర్గం విద్యానగర్‌లోని హిందీ మహావిద్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య. 99 ఏళ్ళ వయస్సు పూర్తి చేసుకున్న ఆయన వీల్ ఛైర్‌లో పోలింగ్ బూత్‌కు వచ్చి మరీ ఓటు వేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని చింతమడక పోలింగ్ కేంద్రానికి సతీసమేతంగా వచ్చిన ఆయన తన ఓటును వేసి వెళ్లారు. సతీమణి శోభతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. పెద్ద ఎత్తున బారులుతీరిన ఓటర్లకు అభివాదం చేశారు. ఇదిలావుంటే సీఎం కేసీఆర్ రెండు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తున్నారు.. గజ్వేల్‌తో పాటు కామారెడ్డి స్థానం నుంచి బరిలోకి దిగారు.
జుబ్లిహిల్స్ నియోజకవర్గం పరిధిలో నటులు నాగార్జున ఓటు హక్కు వినియోగించుకున్నారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు నాగార్జున, అమల, నాగ చైతన్య. ఓటు వేసిన అనంతరం సిరాగుర్తు చూపించారు నాగార్జున, అమల, నాగచైతన్య.
వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాండూర్ పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై జనసేన అభ్యర్ధి ఆరోపించారు. దీంతో రెండు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు తోపులాటకు దారితీసింది. పోలీసుల జోక్యంతో గొడవ సర్దుమణిగింది.
తెలంగాణలో పోలింగ్ సమయంలోనూ ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పంపిన డబ్బులను తమకు ఇవ్వలేదని 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ ఇంటిని స్థానికులు ముట్టడించారు
పాలేరు నియోజకవర్గంలో 2 చోట్ల గొడవలు చోటు చేసుకున్నాయి.
నాయకన్‌గూడెం, జల్లేపల్లిలో ఘర్షణలు
కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు
కూసుమంచి మండలంలో పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు
రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
మణికొండలోని పోలింగ్ బూత్‌కు సమీపంలో నేతలు డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపిస్తూ గొడవకు దిగారు రెండు పార్టీల నేతలు.
ఇరు పార్టీల నాయకుల తోపులాట. దుర్బషలాడుతూ దాడికి యత్నం.
టేబుల్, కుర్చీల ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది.
సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రెండు పార్టీల నేతలను చెదరగొట్టారు.
తెలంగాణలో ఉ.11గంటల వరకు 20.64 శాతం పోలింగ్
అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 30.65 శాతం పోలింగ్
అత్యల్పంగా హైదరాబాద్‌లో 12.39 శాతం పోలింగ్
సంగారెడ్డి-22
మెదక్-30.42
సిద్దిపేట-28.08 శాతం
నిజామాబాద్-21 శాతం
కామారెడ్డి-24 శాతం పోలింగ్
భద్రాద్రి కొత్తగూడెం -22.04 శాతం పోలింగ్
ఖమ్మం-26.03 శాతం పోలింగ్
నేచురల్ స్టార్ నాని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు నాని. యూత్ పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్‌లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కు లేదని అరవింద్ తెలిపారు.
బీఆర్ఎస్ అభ్యర్ధి సునితా లక్ష్మారెడ్డి కుమారుడు శశిధర్‌రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
శశిధర్‌రెడ్డి కారు అద్దాలు ధ్వంసం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.
ఓటర్లను మభ్యపెట్టడానికి వచ్చారంటూ బండరాళ్లతో దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.
పోలీసుల సాయంతో సేఫ్‌గా బయటపడిన వాకిటి శశిధర్‌రెడ్డి.
ఓడిపోతున్నామన్న అక్కసుతోనే కాంగ్రెస్ నేతలు తమపై దాడి చేశారంటున్న వాకిటి శశిధర్‌రెడ్డి ఆరోపించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యధేచ్చగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సైలెంట్ పీరియడ్‌లో రాజకీయ నాయకులు మాట్లాడొద్దనే రూల్స్‌ను రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ లీగల్ సెల్ హెడ్ సోమా భరత్ విమర్శించారు. ఓటు వేసి ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడారని అన్నారు. కేటీఆర్ పేరుతో A1 ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌తో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
సమస్యత్మక ప్రాంతమైన నిర్మల్ జిల్లా భైంసాలో పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. బందోబస్తు కోసం 8 కంపెనీల సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించారు. ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని.. ఎలాంటి రూమర్లను నమ్మవద్దని జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్ సూచించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దర్శకుడు సుకుమార్ కూడా ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వారి కోసం పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని 248 పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న నిర్మాత బండ్ల గణేష్.
హైదరాబాద్ జిల్లాలో ఉ.11 గం.ల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు..
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. యువత, మహిళలతో పాటు వృద్ధులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన 75 ఏళ్ల శేషయ్య తీవ్రమైన లివర్ సిరోసిస్‌తో బాధపడుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్‌తో ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. గచ్చిబౌలిలోని జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌లోని పోలింగ్ కేంద్రంలో శేషయ్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేయడం పౌరుడిగా తన బాధ్యతని చెప్పారు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలోని పోలింగ్ బూత్ వద్ద ఓటేయడానికి వచ్చిన వెంకయ్య అనే వృద్దుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడికి స్థానికులు తక్షణమే సీపీఆర్ చేసి, మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రతి ఎన్నికల మాదిరిగానే ఈసారి ఎన్నికల్లోనూ భాగ్యనగరవాసులు ఓటేయడానికి ఆసక్తి చూపడం లేదు. తొలి మూడు గంటల్లో అత్యల్పంగా 4.57 శాతం పోలింగ్ నమోదయ్యింది. అయితే జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గల్లో 10 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
సిద్దిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు మంత్రి హరీశ్ రావు. తనయుడు అర్చిస్ మాన్, సతీమణి శ్రీనితతో కలిసి ఓటు వేశారు హరీశ్. గతం కంటే రాష్ట్రంలో పోలింగ్ మెరుగ్గా ఉందని, ప్రజలంతా ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొంటున్నారని చెప్పారు హరీశ్. పట్టణ ఓటర్లు కూడా ఓటింగ్‌లో పాల్గొవాలని పిలుపునిచ్చారు.
ముషిరాబాద్ నియోజకవర్గం పరిధిలోని రామ్‌నగర్‌లో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైనదన్నారు త్తాత్రేయ. తనకు ఓటుహక్కు వచ్చినప్పటి చి ప్రతి పోలింగ్‌లోనూ పాల్గొంటున్నానని చెప్పారు.
కామారెడ్డిలో కొనసాగుతున్న హైటెన్షన్
కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం.
కాంగ్రెస్ తీరుకు నిరసనగా ఆందోళనకు దిగిన బీఆర్‌ఎస్ నేతలు.
రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు.
స్థానికేతరులు వెళ్లిపోవాలని BRS నేతల డిమాండ్.
రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలిపిన బీఆర్‌ఎస్ నేతలు.
ఉద్రిక్తతల నేపథ్యంలో కొండల్‌రెడ్డిని నియోజకవర్గం నుంచి పంపేసిన పోలీసులు.
YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి జూబ్లిహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యే కాలనీలోని యూరో కిడ్స్ స్కూల్ 159 నెంబర్ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో గిరిజనులు పోలింగ్ బహిష్కరించారు. ఏన్కూరు మండలం కొత్త మేడిపల్లిలో ఓటింగ్ వేసేందుకు నిరాకరించి నిరసన తెలుపుతున్నారు గిరిజనులు. తమ గ్రామానికి రోడ్డు,మంచినీరు, మౌలిక వసతులు కల్పించలేదని మండిపడుతున్నారు గ్రామస్థులు. తమ సమస్య పరిష్కరించేంత వరకు ఓటు వేయమంటున్నారు గిరిజనులు.
సత్తుపల్లి మండలం సత్తెంపేటలో ఎన్నికలను భహిస్కరించారు గ్రామస్థులు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్న తమ గ్రామాన్ని అభివృద్ధి చేయడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో మూకుమ్మడిగా గ్రామస్థులందరు కలిసి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నిరాకరించారు ఓటర్లు. తమకు హామీ ఇచ్చిన వారికే ఓట్లు వేస్తామని గ్రామ ప్రజలు తేల్చి చెబుతున్నారు.
జనగామ, కామారెడ్డి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, పాలేరు, అచ్చంపేటలో ఘటనలు.
ఆయా జిల్లాల ఘటనల పై సీఈఓ వికాస్ రాజ్ ఆరా.
ఘర్షణలు అదుపు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు, పోలీస్ అధికారులకు సీఈఓ వికాస్ రాజ్ ఆదేశం.
అచ్చంపేట నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత.
పదర మండలం వంకేశ్వరంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఘర్షణ.
రాళ్లు, కర్రలతో కొట్టుకున్న ఇరుపార్టీల కార్యకర్తలు.
పలువురికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు.
అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో హైటెన్షన్.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.
రుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు.
కరీంనగర్ నియోజకవర్గం బీజేపీ ఆభ్యర్థి బండి సంజయ్ కుమార్ కుటుంబసభ్యులతో కలిసి కరీంనగర్‌లో ఓటు వేశారు. తెలంగాణ ప్రజలందరూ తమ ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. నేనొక్కడిని ఓటు వేయకపోతే ఏమవుతుందనే భావనలో ఎవరూ ఉండొద్దని ఆయన కోరారు. నాగార్జునసాగర్ వివాదంపై బండి సంజయ్ స్పందించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కుమ్మక్కై మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఇంతకాలం బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.
పోలింగ్ సందర్భంగా జనగామలో కాసేపు ఉద్రికత్త నెలకొంది. పట్టణంలోని 244 బూత్ దగ్గరకు బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు చేరుకోవడంతో అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది. రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టడంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
రంగారెడ్డి జిల్లాలో ఉ. 9 గంటలకు నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.
ఇబ్రహీంపట్నం: 8.11శాతం
ఎల్బీనగర్: 5.6శాతం
మహేశ్వరం: 5శాతం
రాజేంద్రనగర్: 15శాతం
శేరిలింగంపల్లి: 8శాతం
చేవెళ్ల (ఎస్సీ): 5శాతం
కల్వకుర్తి: 5శాతం
షాద్‌నగర్: 7.2శాతం
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. లింగంపేట మండలం షట్పల్లి సంగారెడ్డి గ్రామంలో పోలింగ్ కేంద్రం సమీపంలో అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడారు. అక్కడికి చేరుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అక్కడున్న పార్టీల కార్యకర్తలందరినీ పోలీసులు చెదరగొట్టారు.
–
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ప్రశాసన్ నగర్ పోలింగ్ కేంద్రం 162 నెంబర్ బూత్ సిరికల్చర్ కమీషనర్ కార్యాలయం లోని తెలంగాణా రైతు సమన్వయ సమితి కార్యాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కరీంనగర్ నియోజకవర్గంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు మంత్రి గంగుల కమలాకర్. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రజలంతా విధిగా ఓటు వేయాలన్నారు గంగుల. తనకు ఓటు హక్కు వచ్చిన నాటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పాల్గొని ఓటు వేస్తున్నానని చెప్పారు.
సనత్ నగర్ నియోజకవర్గం పద్మారావు నగర్లోని తుంగభద్ర మహిళ సంఘంలోని పోలింగ్ బూత్ నంబర్ 85లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల. తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న శేఖర్ కమ్ముల. సెలవుదినంగా భావించకుండా ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని శేఖర్ కమ్ముల పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి, TSRTC MD వీసీ సజ్జనర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొండాపూర్ చిరాక్ పబ్లిక్ స్కూల్ లోని 375వ పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు వేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని అన్నారు సజ్జానర్. మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని ఓటు హక్కు చాటుతుందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొని తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత, విద్యావంతులు ఓటు వేయడాన్ని తమ బాధ్యతగా భావించి.. పోలింగ్ లో పాల్గొనాలని అన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలికెరీ.
బంజారాహిల్స్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు..మంత్రి కేటీఆర్. పట్టణ, నగర ప్రజలంతా ఇళ్లనుండి బయటకు వచ్చి ఓటు వేయాలని సూచించారు. ఓటు వేసి మీ హక్కును కాపాడుకోవాలని కోరారు కేటీఆర్.
నిర్మల్ జిల్లా భైంసాలో ఘర్షన వాతావరణం.
కాషాయ కండువాలతో ఓటు వేసేందుకు కొందరు యువకుల యత్నం.
పార్టీ కండువాలు లేకుండా ఓటు వేయాలని అడ్డుకున్న పోలీసులు.
పార్టీ సింబల్‌లేని కండువాలతో ఓటు వేయాలంటున్న ఓటర్లు.
ఓటు వేయడానికి పర్మిషన్ ఇవ్వాలని పోలీసులతో వాగ్వాదం
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పొలింగ్ బూత్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్‌ఎస్ నేతల దాడి చేశారని ఆరోపించారు. దీంతో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పంపించారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు.. నటుడు శ్రీకాంత్. ప్రజలంతా విధిగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 7.78శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
కొడంగల్ నియోజకవర్గంలో కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కొడంగల్‌లోని ZPHS బాలుర పాఠశాలలోని సౌత్ వింగ్ పోలింగ్ కేంద్రంలోని బూత్ నెం.237లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు రేవంత్ రెడ్డి.
తెలగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
పోలింగ్‌కు ముందే పలు చోట్ల మోరాయించిన ఈవీఎంలు.
EVM ల మోరాయింపులపై టెక్నికల్ టీమ్స్ ను అలెర్ట్ చేస్తున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్.
EVM ల మొరాయింపుల పై మానిటరింగ్ చేస్తున్న జాయింట్ సీఈఓ సర్పరాజ్ అహ్మద్.
EVM మోరాయిస్తే పరిష్కరించేందుకు ప్రత్యేక టెక్నికల్ టీమ్‌ను ఏర్పాటు చేసిన ఈసీ.
ఒక్కో సెగ్మెంట్ కు ముగ్గురు ఇంజనీర్లను నియమించిన ఎలక్షన్ కమిషన్.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది EVM ల టెక్నికల్ టీమ్స్.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఓటు వేశారు. షేక్‌పేట ఇంటర్నేషనల్ స్కూల్లో సతీమణి రమతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.