AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: రాహుల్ గాంధీ బిర్యానీ, పాన్ తిని ఢిల్లీకి వెళ్లిపోతారు.. కాంగ్రెస్‌తో ఒరిగేదేమీ లేదుః కవిత

ప్రతిసారి రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణ ఆతిథ్యాన్ని స్వీకరించి బిర్యాని తిని వెళ్లిపోవాలని సూచించారు. గాంధీ కుటుంబానికి అవసరమైనప్పుడల్లా తెలంగాణ అండగా నిలిచిందని, కానీ వాళ్లు ప్రతిసారి తెలంగాణను మోసం చేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు.

Telangana Election: రాహుల్ గాంధీ బిర్యానీ, పాన్ తిని ఢిల్లీకి వెళ్లిపోతారు.. కాంగ్రెస్‌తో ఒరిగేదేమీ లేదుః కవిత
MLC Kavitha
Prabhakar M
| Edited By: |

Updated on: Nov 26, 2023 | 6:04 PM

Share

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీరుపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. చుట్టపు చూపులా బోధన్ వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్లి బిర్యాని, పాన్ తిని ఢిల్లీకి వెళ్లిపోతారని కవిత ఎద్దేవా చేశారు. ప్రతిసారి ఇలానే తెలంగాణ ఆతిథ్యాన్ని స్వీకరించి బిర్యాని తిని వెళ్లిపోవాలని సూచించారు. గాంధీ కుటుంబానికి అవసరమైనప్పుడల్లా తెలంగాణ అండగా నిలిచిందని, కానీ వాళ్లు ప్రతిసారి తెలంగాణను మోసం చేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు.

పోరాటలతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్న కవిత.. వందలాది మంది యువతను కాంగ్రెస్ పార్టీ బలితీసుకుందని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ ఆలస్యం కావడంతో అనేక మంది ఆత్మబలిదానాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి ఉన్నప్పుడు ఎప్పుడూ శాంతి భద్రతల సమస్య, కర్ఫ్యూలు, మతకల్లోలాలు ఉండేవని, కానీ గత పదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో ఒక్క శాంతి భద్రతల సమస్య తలెత్తలేదని వివరించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రశాంతంగా ఉందని, ప్రజలు ప్రశాంతగా జీవిస్తున్నారన్నారు. ప్రశాంతగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.

బోధన్ నియోజకవర్గంలోని నవీపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ కు మద్ధతుగా నిర్వహించిన రోడ్ షో లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. మంచి వాళ్లను ఎన్నుకుందామా లేదా ముంచేవాళ్లను ఎన్నుకుందామా అన్నది ప్రజలు ఆలోచించాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…