Telangana: తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీలో ఇవాళ విద్య, వైద్యంపై జరిగిన చర్చలో ఫన్నీ సన్నివేశం జరిగింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. కాంగ్రెస్ హయాంలో సభలో మాట్లాడే అవకాశం రాలేదన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి మాటలకు భట్టి ఇచ్చిన సమాధానానికి సభ్యులు పడిపడి నవ్వారు. భట్టిని ఉద్దేశిస్తూ.. మేం నాటి ప్రభుత్వం మాదిరిగా కాదు.. మీరు ప్రశాంతంగా అన్ని విషయాలు చర్చించండి.. మేము వినడానికి సిద్ధంగా ఉన్నామంటూ నవ్వుతూ చెప్పారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.
ఇక మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్‌కు వెంటనే స్పందించారు భట్టి విక్రమార్క. 2009 నుంచి 2014 మధ్య అసెంబ్లీలో జరిగిన పరిణామాలను వివరించారు. ఆ సమయంలో సమావేశాలు సజావుగా సాగకపోవడంపై భట్టి చమత్కారంగా మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి.. కేటీఆర్, హరీశ్‌ను ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణపై పోరు సాగుతున్న సమయంలో అటు కేటీఆర్, ఇటు మంత్రి హరీష్ రావు బల్లాల మీద నుంచి దూకుతూ పోడియంలోకి దూసుకువచ్చారు. ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు దూకుతూ ఉంటే.. సభ ఎలా జరుగుతుంది? అని నవ్వుతూ కౌంటర్ ఇచ్చారు. భట్టి చేసిన ఈ వ్యాఖ్యలకు సభలోని సభ్యులు పడి పడి నవ్వారు. ఇక మంత్రి కేటీఆర్ అయితే.. నవ్వును ఆపుకోలేకపోయారు. సీటులోంచి కిందపడిపోయేలా నవ్వారు. ఈ సన్నివేశం సభలో సీరియస్ వాతావరణానికి కాసేపు బ్రేక్ ఇచ్చింది.
Also read:
Sabja Seeds Benefits: సబ్జా గింజలతో అద్భుత ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
Viral Video: తగ్గేదే లే అంటున్న ఎమ్మెల్యే.. మాస్ పాటకు ఊరమాస్ డ్యాన్స్‌తో దుమ్మురేపారు..!