AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తగ్గేదే లే అంటున్న ఎమ్మెల్యే.. మాస్ పాటకు ఊరమాస్‌ డ్యాన్స్‌తో దుమ్మురేపారు..!

Andhra Pradesh MLA: టాలీవుడ్ మూవీ ‘పలాస 1978’ సినిమాలోని ‘నాది నక్కిలీసు గొలుసు’ పాట తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్‌లో ఫేమస్ అయ్యిందో..

Viral Video: తగ్గేదే లే అంటున్న ఎమ్మెల్యే.. మాస్ పాటకు ఊరమాస్‌ డ్యాన్స్‌తో దుమ్మురేపారు..!
Mla Dance
Shiva Prajapati
|

Updated on: Mar 12, 2022 | 6:40 PM

Share

Andhra Pradesh MLA: టాలీవుడ్ మూవీ ‘పలాస 1978’ సినిమాలోని ‘నాది నక్కిలీసు గొలుసు’ పాట తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్‌లో ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఏ ఫంక్షన్ అయినా.. ఆ పాట ఉండాల్సిందే అన్నట్లుగా మారిపోయింది. ఈ పాటకు యావత్ యువతే కాదు.. చిన్నా పెద్ద అంతా ఊగిపోయారు. ఆ పాట వినిపిస్తే ఆటోమాటిక్‌గా కాళ్లు, చేతులు కదిలిపోతుంటాయి. ఆ రేంజ్‌లో జనాలను ఆకట్టుంది పాట. అయితే, తాజాగా ఇదే పాటకు ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఓ రేంజ్‌లో డ్యాన్స్ వేశారు. పద పదానికి, పాదం కదుపుతూ.. ట్యూన్‌కు తగ్గట్లుగా స్టెప్పులు వేస్తూ దుమ్ము రేపారు.

పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ నేత పైమాఘం సుగుణాకర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో.. వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పాల్గొన్నారు. చెన్నైలోని ఒక హోటల్‌లో జరిగిన ఈ బర్త్‌డే వేడుకల్లో డీజే కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ బాబు.. పార్టీ కార్యకర్తలు, అనుచరులతో డ్యాన్స్ వేశారు. ‘నాదీ నక్కిలీసు గొలుసు’ పాట వేయగా.. అదిరిపోయే మాస్ స్టెప్పులతో అలరించారు ఎమ్మెల్యే బాబు. పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ దుమ్మురేపారు. కాగా, ఎమ్మెల్యే డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే డ్యాన్స్‌కు ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఫిదా అయిపోతున్నారు. ‘తగ్గేదే లే ఎమ్మెల్యే గారూ..’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరెందుకు ఆలస్యం ఎమ్మెల్యే డ్యాన్స్‌ను మీరూ చూసేయండి..

Also read:

Hyderabad: భాగ్యనగరం చుట్టూ రియల్ బూమ్.. ప్రైవేట్‌ రియల్ ఎస్టెట్‌ సంస్థలకు ఇప్పుడిక కొత్త ఛాలెంజ్..

Birth Control Pills side effects: గర్భనిరోధక పద్ధతులు పాటిస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..

Kandikonda: కందికొండ ఆత్మహత్య అంటూ నెట్టింట్లో రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన కుటుంబసభ్యులు..