AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kandikonda: కందికొండ ఆత్మహత్య అంటూ నెట్టింట్లో రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన కుటుంబసభ్యులు..

తెలుగు చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కవి.. పాటల రచయిత కందికొండ యాదగిరి (Kandikonda) శనివారం మృతి చెందారు.

Kandikonda: కందికొండ ఆత్మహత్య అంటూ నెట్టింట్లో రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన కుటుంబసభ్యులు..
kandikonda
Rajitha Chanti
|

Updated on: Mar 12, 2022 | 6:21 PM

Share

తెలుగు చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కవి.. పాటల రచయిత కందికొండ యాదగిరి (Kandikonda) శనివారం మృతి చెందారు. క్యాన్సర్‏తో పోరాడి గెలిచిన కందికొండ పెరాలసిస్ బారిన పడి నడవలేని స్థితికి చేరిపోయారు. ఇటీవల ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న కందికొండకు తెలంగాణ మంత్రి కేటీఆర్ సాయం చేశారు. కందికొండ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సైతం ఆయనకు ఆర్థికంగా సాయం చేశారు. దీంతో గత కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్న కందికొండ.. శనివారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.

అయితే కందికొండ మరణంపై సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. కందికొండ అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతూ.. ఆత్మహత్య చేసుకున్నారంటూ నెటింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆయనది సహజ మరణమే అని.. ఆత్మహత్య చేసుకోలేదంటూ కుటుంబసభ్యులు వివరణ ఇచ్చారు. దయచేసి ఆయన మరణం పై వదంతులు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. కందికొండ అంత్యక్రియలు రేపు హైదరాబాద్‏లో నిర్వహించనున్నారు.

తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ పాటలు రాసి శ్రోతలను మెప్పించారు కందికొండ. వరంగల్ జిల్లాలో మారుమూల గ్రామంలో పుట్టిన కందికొండ.. ఓయూలో ఎంఏ తెలుగు చేసి.. సాహిత్యంపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రితో ఉన్న సాన్నిహిత్యంతో సినిమాలకు పాటలకు రాయడం ప్రారంభించారు కందికొండ. ఆయన రాసిన ఫస్ట్ సాంగ్ మళ్లీ కూయవే గువ్వా పాట సూపర్ హిట్ అయ్యింది. కేవలం సినిమా పాటలే కాకుండా.. బతుకమ్మ పాటలు… జానపదాలు రాయడంలోనూ కందికొండ దిట్ట.

Also Read: Naveen Polishetty: బ్యాక్ గ్రౌండ్ లేదు ఇండస్ట్రీలో కష్టమన్నారు.. హీరో నవీన్ పోలిశెట్టి కామెంట్స్ వైరల్..

Sebastian pc 524: ఆహాలో సందడి చేయనున్న కిరణ్ అబ్బవరం.. సెబాస్టియన్ పీసీ 524 మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Radhe Shyam: రాధేశ్యామ్ సినిమాపై మీమ్స్‏తో ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన తమన్..

Anchor Anasuya: మీవల్లే స్ట్రాంగ్‏గా నిలబడ్డాను.. మీరే నా ఆర్మీ.. యాంకర్ అనసూయ ఆసక్తికర కామెంట్స్..