AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రాజలింగమూర్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు

భూపాలపల్లిలో ప్రకంపనలు రేపిన రాజలింగమూర్తి హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ హత్యలో మొత్తం 10 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు. వారిలో ఏడుగుర్ని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భూమికి సంబంధించి తలెత్తిన వివా దంతోనే రాజలింగమూర్తిని ప్రత్యర్థులు హతమార్చారని పోలీసుల విచారణలో వెల్లడైంది.

Telangana: రాజలింగమూర్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు
Activist Rajalingamurthy
Ram Naramaneni
|

Updated on: Feb 23, 2025 | 12:40 PM

Share

సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యకు ముందే ప్లాన్‌ చేసిన నిందితులు.. వరంగల్‌లోని కాశీబుగ్గలో కత్తులు, రాడ్లు కొనుగోలు చేసినట్లు భూపాలపల్లి పోలీసులు ఆధారాలు సేకరించారు. నిందితుల నుంచి 2 కత్తులు, 2 రాడ్లు, 5 బైక్‌లు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు కలిసి హత్య చేయగా.. ఇద్దరు రెక్కీ నిర్వహించారు. మరో ముగ్గురు.. నిందితులకు సహాయం చేసినట్లు పోలీసులు తేల్చారు.

రాజలింగమూర్తి హత్య కేసుకు సంబంధించి భూపాలపల్లి ఎస్పీ కిరణ్‌ కీలక విషయాలు వెల్లడించారు. రాజలింగమూర్తి హత్యకు భూవివాదమే కారణమని తెలిపారు. ఎకరం భూమి విషయంలో సంజీవ్‌, రాజలింగమూర్తి మధ్య కొన్నాళ్లుగా భూవివాదం కొనసాగుతుందని చెప్పారు. ప్లాన్‌ ప్రకారం కంట్లో కారం కొట్టి కత్తులతో పొడిచి రాజలింగమూర్తిని హత్య చేశారన్నారు ఎస్పీ కిరణ్‌.

రాజలింగమూర్తి హత్యకు కొత్త హరిబాబు అనే వ్యక్తి ప్లాన్‌ చేసినట్లు గుర్తించామన్నారు ఎస్పీ కిరణ్‌. ప్రధాన నిందితుడు సంజీవ్‌కు హరిబాబు సపోర్ట్‌ చేశారని.. పరారీలో ఉన్న ఆయన కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. రాజలింగమూర్తి మర్డర్‌కు సంబంధించి ఇతర కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతుందన్నారు ఎస్పీ కిరణ్‌. ఈ నెల 19న రాత్రి సుమారు 7 గంటల సమయంలో రాజలింగమూర్తి హత్యకు గురైన  విషయం తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

Follow Us
జూలై నెలలోనూ నిరాశే.. వర్షాలు అంతంత మాత్రమే!
జూలై నెలలోనూ నిరాశే.. వర్షాలు అంతంత మాత్రమే!
బ్యాంకింగ్‌ రంగంలో విప్లవం.. ATM పిన్ చరిత్ర తెలుసా
బ్యాంకింగ్‌ రంగంలో విప్లవం.. ATM పిన్ చరిత్ర తెలుసా
గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. సిలిండర్‌పై రూ.183.50 తగ్గింపు!
గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. సిలిండర్‌పై రూ.183.50 తగ్గింపు!
సోలార్ పవర్డ్ స్మార్ట్ బెంచీలు.. రిలాక్స్ అండ్ ఛార్జ్
సోలార్ పవర్డ్ స్మార్ట్ బెంచీలు.. రిలాక్స్ అండ్ ఛార్జ్
టీ vs కాఫీ.. ఉదయాన్నే ఏది తాగితే మీ ఎముకల బలానికి మంచిది..?
టీ vs కాఫీ.. ఉదయాన్నే ఏది తాగితే మీ ఎముకల బలానికి మంచిది..?
మామిడి, టమాటా, ఉసిరి, నిమ్మకాయ.. అబ్బ పచ్చళ్ళు అనుకుంటున్నారా..?
మామిడి, టమాటా, ఉసిరి, నిమ్మకాయ.. అబ్బ పచ్చళ్ళు అనుకుంటున్నారా..?
నేటి నుంచి మళ్లీ అందుబాటులోకి పీఎఫ్ ఆన్ లైన్ సేవలు..
నేటి నుంచి మళ్లీ అందుబాటులోకి పీఎఫ్ ఆన్ లైన్ సేవలు..
ఖాళీ కడుపుతో బెల్లం తింటే, కోట్ల రూపాయలు ఇచ్చినా దొరకని ఆరోగ్యం!
ఖాళీ కడుపుతో బెల్లం తింటే, కోట్ల రూపాయలు ఇచ్చినా దొరకని ఆరోగ్యం!
గంభీర్ vs వైభవ్.. బుడ్డోడిని ఆడించక పోవడానికి అసలు కారణం ఇదేనంట?
గంభీర్ vs వైభవ్.. బుడ్డోడిని ఆడించక పోవడానికి అసలు కారణం ఇదేనంట?
పెట్రోల్, డీజిల్ కాదు.. సైనికుల వాహనాలు నడిచేది దానితోనే
పెట్రోల్, డీజిల్ కాదు.. సైనికుల వాహనాలు నడిచేది దానితోనే