పట్టుదల, అంకిత భావం ఉంటే మనిషి ఏదైనా సాధించ వచ్చు అనడానికి నిదర్శనం. ఈ యువకుడు ఉన్నత చదువు చదివి సరైన అవకాశాలు రాక సొంత ఊళ్ళో బైక్ మెకానిక్ గా స్వశక్తితో బతకడమే కాక తన చదువుకు కొంత మేధస్సు జోడించి అందరితో శభాష్ అనిపించుకున్నాడు మొహంత్ అనే యువకుడు. కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి మోహంత్ అనే యువకుడు బీటెక్ ఈఈఈ పూర్తి చేసి సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడంతో సొంత ఊళ్ళోనే ఓ బైక్ మెకానిక్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పక్కకు పడేసిన తన ద్విచక్ర వాహనాన్ని బ్యాటరీతో నడిపించాలని ఆలోచన రావడంతో తన ఇంజనీరింగ్ మిత్రుడిని ఫోన్ ద్వారా సంప్రదించాడు. తన సూచనలతో పాటు యూట్యూబ్ ద్వారా మరికొంత సమాచారం తెలుసుకొని బ్యాటరీతో నడిచే వాహనాన్ని రూపొందించాడు.
25 వేల రూపాయలు వెచ్చించి మోటారు, బ్యాటరీ తదితర వస్తువులు కొనుగోలు చేసి తనకున్న పరిజ్ఞానంతో వారం రోజులు కష్టపడి ఈ వాహనాన్ని తయారు చేశాడు. ఈ వాహనం రెండు గంటలు చార్జింగ్ పెడితే సుమారు 80 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చాను చెప్తున్నాడు మొహంత్. ప్రభుత్వం సహకారం అందిస్తే ఇంకా అద్భుతమైన ఆవిష్కరణ చేయగలనని చెప్తున్నాడు ఈ యువకుడు. ప్రస్తుతం ఎలక్ట్రికల్ వాహనాలు విరివిగా లభిస్తున్న వాటి ధరలు మాత్రం సామాన్య ప్రజానీకానికి అందుబాటులో లేవని తమలాంటి వారికి ప్రోత్సాహం అందిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని మొహంత్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి