Telangana: భూ సమస్య తీర్చి బాధితుడి కొడుకు దృష్టిలో హీరోగా మారిన జిల్లా కలెక్టర్.. ఐడాక్‌లో కలుసుకుని సందడి
ప్రజల దృష్టిలో హీరోలుగా నిలబడవచ్చు. ఇందుకు ఉదాహరణగా నిలబడుతున్నారు పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు. తాజాగా ఓ జిల్లా కలెక్టర్ ఒక వ్యక్తి భూ సమస్యను పరిష్కరించారు. దీంతో బాధితుడి తనయుడు దృష్టిలో ఆ కలెక్టర్ హీరో అయ్యాడు. అభిమానిగా మారాడు. ఈ తెలంగాణలోని కొత్తగూడెంలో చోటు చేసుకుంది.

ప్రజల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకుని అభిమానాన్ని సంపాదించుకోవాలంటే.. సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదు.. ఫైట్స్, డ్యాన్స్ చేయాల్సిన అవసరం లేదని కొందరు అధికారులు నిరూపిస్తున్నారు. అవును ప్రభుత్వ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తే ప్రజల దృష్టిలో హీరోలుగా నిలబడవచ్చు. ఇందుకు ఉదాహరణగా నిలబడుతున్నారు పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు. తాజాగా ఓ జిల్లా కలెక్టర్ ఒక వ్యక్తి భూ సమస్యను పరిష్కరించారు. దీంతో బాధితుడి తనయుడు దృష్టిలో ఆ కలెక్టర్ హీరో అయ్యాడు. అభిమానిగా మారాడు. ఈ తెలంగాణలోని కొత్తగూడెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
దమ్మపేట మండలం జమేదార్ బంజర్‌కు చెందిన కుంజా వెంకటేశ్వలు తనకు భూమి సమస్య ఉంది.. పరిష్కరించమని కొంతకాలం క్రితం గ్రీవెన్స్ సెల్‌లో వినతిపత్రం సమర్పించాడు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పందిస్తూ.. పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై సభలో చర్చ జరగడంతో కలెక్టర్ ఆదేశాలతో భూ సమస్య పరిష్కారం జరుగుతుందని వెంకటేశ్వర్ల కుటుంబ సభ్యులకు తెలిపారు.
భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడడం బాధితుడు వెంకటేశ్వర్లు కుమారుడు హర్షానందన్ పరిశీలించాడు. దీనికి కారణంగా హర్షానందన్ కలెక్టర్‌ను కలవాలని పట్టుబట్టాడు. కలెక్టరేట్‌కు తీసుకెళ్లాలని తండ్రిని కోరారు. కొడుకు కోరిక తీర్చడం కోసం సోమవారం వెంకటేశ్వర్లు తన కుమారుడిని కలెక్టరేట్‌కు తీసుకొచ్చి ప్రజావాణి సమావేశంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిను కలిశారు. కలెక్టర్‌ని కలిసిన హర్షానందన్ సంతోషంగా కరచాలనం చేశాడు. అనుదీప్ దురిశెట్టి కొద్దిసేపు ఆ బాలుడితో మాట్లాడి.. ఫోటో దిగారు. ఈ ఘటన సోమవారం ప్రజావాణిలో హైలెట్‌గా మారింది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..