Telangana: వయస్సు 70 ఏళ్ళు.. పథకాలలో రారాణి! అంతర్జాతీయ వేదికపై మెరిసిన మన ‘పరుగుల బామ్మ’

| Edited By: Srilakshmi C

Sep 22, 2023 | 11:10 AM

ఆమె పరుగు పెడితే.. పక్క వారు ఆశ్చర్యంగా చూడాల్సిందే. అనుకున్న టార్గెట్ సాధించే వరకు పరుగులు తీస్తూనే ఉంటుంది. అందుకే ఆమెను అందరు పరుగుల బామ్మ అని పిలుస్తారు. ఇప్పటికి జాతీయ, అంతర్జాతీయ పరుగు పందెం పోటిల్లో పాల్గొని.. పలు పథకాలు సాధించింది. అసలు ఎవరు ఈ పరుగుల బామ్మ? ఆమె కథెంటో తెలుసుకుందాం.. 70 ఏళ్ల వయసులో అంతర్జాతీయ పతకం సాధించింది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన టమటం రామానుజమ్మ..

Telangana: వయస్సు 70 ఏళ్ళు.. పథకాలలో రారాణి! అంతర్జాతీయ వేదికపై మెరిసిన మన పరుగుల బామ్మ
Athlet Tamatam Ramanujamma
Follow us on

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్‌ 22: ఆమె పరుగు పెడితే.. పక్క వారు ఆశ్చర్యంగా చూడాల్సిందే. అనుకున్న టార్గెట్ సాధించే వరకు పరుగులు తీస్తూనే ఉంటుంది. అందుకే ఆమెను అందరు పరుగుల బామ్మ అని పిలుస్తారు. ఇప్పటికి జాతీయ, అంతర్జాతీయ పరుగు పందెం పోటిల్లో పాల్గొని.. పలు పథకాలు సాధించింది. అసలు ఎవరు ఈ పరుగుల బామ్మ? ఆమె కథెంటో తెలుసుకుందాం..

70 ఏళ్ల వయసులో అంతర్జాతీయ పతకం సాధించింది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన టమటం రామానుజమ్మ. ఆమె అంతర్జాతీయ వేదికపై మెరిసింది. 35వ ఇంటర్నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో 50 కిలోల విభాగంలో పాల్గొని రజతం సాధించారు. మలేసియాలోని కౌలాలంపూర్లో ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరిగిన పరుగు 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్ల విభాగాల్లో తలపడ్డ ఆమె 200 మీటర్ల విభాగంలో మూడోస్థానం సాధించారు. దేశం తరఫున మాస్టర్స్ అథ్లెటిక్స్ లో పాల్గొనడం, మూడోస్థానం సాధించడం గర్వంగా ఉందని రామానుజమ్మ కౌలాలంపూర్ నుంచి మంగళవారం తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించిన నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియే షన్ ఇండియా ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఆమె మాట్లాడుతూ సిరిసిల్లలో స్టేడియం నిర్మించకముందు ఖాళీ స్థలంలో ప్రాక్టీసు చేసానని స్టేడియం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక రోజు ఉదయం సాయంత్రం వెళ్లి కటోర సాధన చేశానని అన్నారు. నాకు నేను ఒంటరిగా ఆలోచన చేసుకొని ఎవరి సలహాలు సూచనలు తీసుకోలేదని నా గట్టి సంకల్పం తో ముందుకు వెళ్లానని అన్నారు. రజతం సాధించాక అందరూ నన్ను సన్మాలు సత్కారాలతో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. కుటుంబ సభ్యులు తోడ్పాటు అందించారని అన్నారు. మలేసియా వెళ్ళడానికి స్థానిక ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ కు15 ఆగస్ట్ రోజున కలసి ఫ్లైట్ టికెట్ ఆరంజ్ చేయమని కోరింది. కేటీఆర్ సహాయం చేయలేదని సిరిసిల్ల పట్టణానికి చెందిన కొందరు డాక్టర్లు సహాయం చేశారని తెలిపారు. భర్త చనిపోయి15 సంవత్సరాలు అయ్యిందని ఇద్దరు కొడుకులు ఉన్నారని వాళ్ళు స్థిరపడడం తో ఒంటరిగా చంద్రంపేటలో జీవనం సాగిస్తున్నాని ఇప్పటి వరకు హుహా తెలిసినప్పటి నుండి ఒక గోలి (మాత్రలు) కానీ, ఇంజెక్షన్ తీసుకోలేదని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే తెలంగాణకు మరిన్ని పథకాలు సాధిస్తానని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.