తెలంగాణలో మూడువేల స్కూళ్లు బంద్..!! ఎందుకో తెల్సా..?

| Edited By: Anil kumar poka

Oct 22, 2019 | 3:49 PM

తెలంగాణలోని అప్పర్ ప్రైమరీ స్కూళ్లను.. దగ్గరలోని హైస్కూళ్లల్లో విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ (టీటీఎఫ్) సంస్థ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హేతుబద్దీకరణ’ పేరిట ప్రభుత్వం ఇలా దాదాపు 3,500 స్కూళ్లను మూసివేయాలనుకుంటుందని.. దీని వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థినులు ఎంతో నష్టపోతారని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేసిన పక్షంలో స్కూళ్లల్లో డ్రాప్ అవుట్స్ అంటే (మధ్యలోనే స్కూల్ మానేసే విద్యార్థుల సంఖ్య) పెరుగుతుందని టీటీఎఫ్ అధ్యక్షుడు ఈ.రఘునందన్ […]

తెలంగాణలో మూడువేల స్కూళ్లు బంద్..!! ఎందుకో తెల్సా..?
Follow us on

తెలంగాణలోని అప్పర్ ప్రైమరీ స్కూళ్లను.. దగ్గరలోని హైస్కూళ్లల్లో విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ (టీటీఎఫ్) సంస్థ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హేతుబద్దీకరణ’ పేరిట ప్రభుత్వం ఇలా దాదాపు 3,500 స్కూళ్లను మూసివేయాలనుకుంటుందని.. దీని వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థినులు ఎంతో నష్టపోతారని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేసిన పక్షంలో స్కూళ్లల్లో డ్రాప్ అవుట్స్ అంటే (మధ్యలోనే స్కూల్ మానేసే విద్యార్థుల సంఖ్య) పెరుగుతుందని టీటీఎఫ్ అధ్యక్షుడు ఈ.రఘునందన్ అంటున్నారు.

ఇప్పటికే అనేక చోట్ల ప్రభుత్వ స్కూళ్లు దూరంగా ఉంటున్నాయి. ఇప్పుడు అప్పర్ ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తే.. ముఖ్యంగా.. 5వ తరగతి విద్యార్థులు స్కూళ్లకు రావడం మానేస్తారని అన్నారు. గతంలో ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంది.. కానీ.. టీచర్ల ఆందోళనతో దానికి స్వస్తి పలికింది. అప్పట్లో.. ‘హేతుబద్దీకరణ’ పేరుతో.. 4000 స్కూళ్లను మూసివేసింది. కాగా.. మరింత మంది టీచర్ల నియామకం జరగకుండా చూసేందుకే ప్రభుత్వం వరుసగా ఇలా స్కూళ్లను మూసివేస్తోందని.. టీటీఎఫ్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఉపాధ్యాయుల నియామకం వల్ల విద్యారంగానికి బడ్జెట్ పెరుగుతుందన్న భయమే ఈ సర్కార్‌కి పట్టుకుందని వారు ఆరోపిస్తున్నారు.