Telangana: ఆ బాలిక ఇంతకూ ఎటు వెళ్ళింది.. పోలీసుల ఎంక్వైరీలో మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్

|

Dec 30, 2023 | 7:18 PM

ఆమె చేసిన పనితో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సదరు బాలిక కనిపించడం లేదని.. ఆచూకి తెలిస్తే సమాచారమివ్వాలంటూ పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సమయంలో  బాలిక మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించే TSRTC బస్సుల్లో ప్రయాణిస్తూనే ఉంది. తొలుత పెద్దపల్లిలో ఉన్న తాతయ్య వద్దకు వెళ్లింది బాలిక.

Telangana: ఆ బాలిక ఇంతకూ ఎటు వెళ్ళింది.. పోలీసుల ఎంక్వైరీలో మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్
TSRTC
Follow us on

హాస్టల్‌కు వెళ్లకుండా తప్పించుకునేందుకు ఓ 12 ఏళ్ల బాలిక చేసిన పని.. తల్లిదండ్రులను కంగారు పెట్టగా.. పోలీసులను పరుగులు తీయించింది. డిసెంబరు 27వ తేదీ బుధవారం నాడు పెద్దపల్లి నుంచి కరీంనగర్‌కు వెళ్లేందుకు పెద్దపల్లిలో టీఎస్‌ఆర్‌టీసీ బస్సు ఎక్కింది సదరు బాలిక. అక్కడ తనను బోర్డింగ్ స్కూల్‌లో జాయిన్ చేసి.. హాస్టల్‌లో ఉంచారు. దీంతో అక్కడికి వెళ్లకుండా మస్కా కొట్టేందుకు కేవలం తన ఆధార్ కార్డు సాయంతో TSRTC బస్సులలో ఉచితంగా ప్రయాణించే కొన్ని రోజులు గడిపింది.

ఆమె చేసిన పనితో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సదరు బాలిక కనిపించడం లేదని.. ఆచూకి తెలిస్తే సమాచారమివ్వాలంటూ పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సమయంలో  బాలిక మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించే TSRTC బస్సుల్లో ప్రయాణిస్తూనే ఉంది. తొలుత పెద్దపల్లిలో ఉన్న తాతయ్య వద్దకు వెళ్లింది బాలిక. సెలవులు ముగియడంతో తాత ఆమెను బస్ స్టాండ్‌కు తీసుకెళ్లి బస్సు ఎక్కించాడు. ఆయన బస్సు నంబర్‌ను కూడా అమ్మాయి పాప తండ్రికి తెలియజేశాడు. కరీంనగర్‌లోని మంచిర్యాల చౌరస్తాలో బాలికను బస్సు దిగాలని సూచించారు. పాప తండ్రి ఆ ప్రాంతానికి చేరుకుని బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. బస్సు వచ్చింది, కానీ అమ్మాయి రాలేదు. దీంతో కంగారు పడిన బాలిక తండ్రి.. బస్సు కండక్టర్‌ను సమాచారమడిగాడు. పాప బై-పాస్ రోడ్డులో దిగిందని కండక్టర్ సమాధానమిచ్చాడు. 

బాలిక తన ఆధార్ కార్డును ఉపయోగించి 36 గంటల వ్యవధిలో జగిత్యాల, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, హైదరాబాద్ మీదుగా ప్రయాణించింది. తిరిగి కరీంనగర్‌లోని హాస్టల్‌కు వెళ్లకుండా ఉండేందుకు బాలిక నాన్‌స్టాప్‌‌గా ఆర్టీసీ బస్సులను ఎక్కినట్లు పోలీసులు తెలిపారు.  ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పోలీసులను విసృత గాలింపు జరపడంతో చివరకు ఆచూకీ లభించింది. డిసెంబర్ 29, శుక్రవారం రోజున సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్‌లో బాలికను గుర్తించారు. 36 గంటలపాటు వెతికిన తర్వాత బాలికను కనుగొని ఆమె కుటుంబం సభ్యులకు సమాచారమిచ్చినట్లు పోలీసులు తెలిపారు. బాలిక అదృశ్యమైన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రచారం చేసినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పాప ఆచూకీ కోసం నాలుగు పోలీసు బృందాలు పని చేసినట్లు తెలిపారు. 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…