Bandi Sanjay: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు నిరసన సెగ తాకింది. గురుకుల కార్యదర్శి డా. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై బీజేపీ అసత్య ప్రచారానికి పాల్పడుతోందంటూ.. స్వేరోస్, జై భీమ్ యూత్ ఇండియా నాయకులు సంజయ్‌ను అడ్డుకున్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు మంగళవారం తేదీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మంగళవారం హుజూర్‌నగర్‌లో పర్యటించారు. పర్యటన అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో సూర్యాపేటలో జై భీమ్ కార్యకర్తలు, స్వేరోస్, గురుకులాల విద్యార్థుల తల్లిదండ్రులు బండి సంజయ్ వాహనాలను అడ్డుకొని నిరసన తెలిపారు. బీజేపీ నాయకులు ప్రవీణ్ కుమార్‌పై లేనిపోనీ ఆరోపణలు చేస్తున్నారంటూ నిరసనకారులు, జై భీమ్ యూత్ ఇండియా నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రవీణ్ కుమార్‌కు బీజేపీ నాయకులు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో హుజూర్‌నగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా.. పెద్దపల్లి జిల్లాలో జరిగి స్వేరోస్ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ సహా అక్కడున్న వారంతా చేసిన ప్రతిజ్ఞ వివాదాస్పదమైంది. దీంతో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ సహా బీజేపీ నేతలందరూ డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. బీజేపీ తీరుపై స్వైరోస్, దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. కావాలనే బీజేపీ నేతలు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై నిందలు వేస్తున్నారంటూ బుధవారం పలు ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
Also Read: