Sarpanch’s Suspension: నిర్లక్ష్యం వహిస్తే వేటే.. నాగర్‌కర్నూల్ జిల్లాలో ముగ్గురు సర్పంచ్‌ల సస్పెన్షన్

Suspension of Sarpanchs: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు సర్పంచ్‌లపై వేటు పడింది. నాగర్ కర్నూల్ జిల్లాలో పల్లెప్రగతి, వైకుంఠధామం

Sarpanch's Suspension: నిర్లక్ష్యం వహిస్తే వేటే.. నాగర్‌కర్నూల్ జిల్లాలో ముగ్గురు సర్పంచ్‌ల సస్పెన్షన్
Nagarkurnool Collector

Suspension of Sarpanchs: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు సర్పంచ్‌లపై వేటు పడింది. నాగర్ కర్నూల్ జిల్లాలో పల్లెప్రగతి, వైకుంఠధామం నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు సర్పంచ్‌లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శర్మన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దకొత్తపల్లి మండలం దేదీనేని పల్లి సర్పంచ్ కె. రజిత, బలమూర్ మండలం మహాదేవుపూర్ గ్రామ సర్పంచ్ ఎ. మయూరి, ఉప్పునూతల మండలం అయ్యవారిపల్లి గ్రామ సర్పంచ్ ఊర్మిళ తమ గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్లక్ష్యం చేసినందుకు సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు.

పల్లెప్రగతి, పారిశుధ్యం, హరితహారం వంటి కార్యక్రమాల్లో సర్పంచులు కానీ, పంచాయతీ సెక్రెటరీలు కానీ తమ విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్పంచ్‌లు సెక్రటరీలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు. విధుల్లో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. అయితే.. ఒకేసారి ముగ్గురు సర్పంచ్‌లను సస్పెండ్ చేయడం ప్రస్తుతం జిల్లాలో సంచలనంగా మారింది.

Also Read:

Instant Pan Card: మీ పాన్‌ కార్డ్ పోయిందా?.. ఇన్‌స్టాంట్ పాన్‌కార్డ్ ను ఇలా ఈజీగా పొందండి..!

దారుణం.. కుటుంబంలో ఐదుగురిని చంపి.. ఆపై వ్యక్తి ఆత్మహత్య.. రక్తపు మడుగులో మృతదేహాలు..