Telangana: పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. పూర్తి వివరాలు

|

Mar 25, 2025 | 9:55 PM

తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు ఇంట్రెస్టింగ్‌గా మారింది. సుప్రీంకోర్టులో జరిగిన వాడీవేడి వాదనల తర్వాత... వ్యవహారం మరింత ముదురి పాకానపడినట్లైంది. ఇంతకీ బీఆర్ఎస్‌ నేతల తరుపున లాయర్లు వినిపించిన వాదనలేంటి...? దానికి ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణ ఏంటి...? అసలు సుప్రీంకోర్టు రియాక్షన్‌ ఎలా ఉంది...? ఏప్రిల్‌ 2న ఏం జరగబోతోంది...?

Telangana: పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. పూర్తి వివరాలు
Supreme Court Of India
Follow us on

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకెక్కింది బీఆర్ఎస్. కేటీఆర్‌ తరుపున శేషాద్రి నాయుడు, కౌశిక్‌రెడ్డి తరుపున లాయర్‌ సుందరం వాడీవేడి వాదనలు వినిపించారు. పార్టీ మారిన10మంది ఎమ్మెల్యేల గురించి ప్రస్తావించారు. దానం నాగేందర్‌ను ఎగ్జాంఫుల్‌గా చూపించారు. దానం బీఆర్‌ఎస్‌ MLAగా ఉంటూనే కాంగ్రెస్‌ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేశారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయాక కూడా దానం MLAగా కొనసాగుతున్నారని… అయినా ఇప్పటివరకు స్పీకర్‌ నోటీసులు ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. అలాగే… తమ ఫిర్యాదుపై స్పందించేందుకు స్పీకర్ కూడా విముఖంగా ఉన్నారని కోర్టుకు వెల్లడించారు. అందుకే, హైకోర్టును ఆశ్రయిస్తే… ఎమ్మెల్యేలపై విచారణ జరిపేందుకు నాలుగు వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయమని సింగిల్ జడ్జి తీర్పుచ్చినా ఎలాంటి ముందడుగు పడలేదని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్‌ తరపు అడ్వొకేట్లు.

ఇది చదవండి: సంతృప్తి కోసం ప్రైవేట్‌ పార్టులోకి.. నొప్పితో పరుగు పరుగున ఆస్పత్రికి.. ఎక్స్‌రే తీయగా

విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నోటీసులు ఇవ్వడానికి.. నిర్ణయం తీసుకోవడానికి ఎంత టైమ్‌ కావాలని ప్రశ్నించింది. రీజనబుల్‌ టైమ్‌ అంటే పదవీకాలం పూర్తయ్యేవరకా అంటూ కామెంట్ చేసింది. మొదటి ఫిర్యాదు నాటి నుంచి ఇప్పటివరకు ఎంత సమయం గడిచిందని అడిగిన ధర్మాసనం.. MLAలకు కనీసం నోటీసులు కూడా ఎందుకివ్వలేదని ప్రశ్నించింది. అలాగే… కౌంటర్‌ దాఖలుకు సమయం కోరిన ప్రతివాదులపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో డిలే ట్యాక్టిక్స్ అమలు చేయొద్దంటూ సీరియస్‌ అయ్యింది. ఇక ఈ ఫిరాయింపుల కేసును ఏప్రిల్‌ 2కి వాయిదా వేసింది. ప్రతివాదుల వాదనలనూ తదుపరి విచారణలోనే వినే అవకాశం ఉంది.

సుప్రీంకోర్టులో విచారణకు ముందు స్పీకర్ తరుపున అసెంబ్లీ సెక్రటరీ కౌంటర్‌ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోలేదు అనడం సరైందికాదని… అనర్హత చట్టం ప్రకారం స్పీకర్ నడుచుకుంటున్నారని తెలిపారు. అలాగే ఈ వ్యవహారంలో పిటిషనర్లు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారన్నారు. పార్టీ ఫారాయించిన ఎమ్మెల్యేల ఇష్యూపై స్పీకర్‌ను ఆశ్రయించిన వెంటనే వారు కోర్టును ఆశ్రయించారని తెలిపారు. దురుద్దేశంతో వేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోరారు అసెంబ్లీ సెక్రటరీ. మొత్తంగా… ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టు మెట్లెక్కడంతో నెక్ట్స్‌ ఏం జరగబోతోందన్న ఆసక్తి నెలకొంది. నెక్ట్స్‌ సెషన్‌లో ప్రతివాదులు వాదనలను సుప్రీం వినే అవకాశం ఉండటంతో… ఏప్రిల్‌ 2న ఎలాంటి తీర్పు రాబోతోందన్నది ఆసక్తిగా మారింది.

ఇది చదవండి: ఏపీ, తెలంగాణల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్ని రోజులంటే.?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి