Delhi Excise Policy Case: ‘సుప్రీం’ డైరెక్షన్ ఎలా ఉండబోతుంది..? నేడే ఎమ్మెల్సీ కవిత పిటిషన్ విచారణ..

ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కవిత పిటిషన్ నెంబర్ 36 గా లిస్ట్ అయ్యింది. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కవిత పిటిషన్ పై విచారణ చేపట్టనుంది.

Delhi Excise Policy Case: ‘సుప్రీం’ డైరెక్షన్ ఎలా ఉండబోతుంది..? నేడే ఎమ్మెల్సీ కవిత పిటిషన్ విచారణ..
MLC Kavitha

Updated on: Mar 27, 2023 | 11:04 AM

ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కవిత పిటిషన్ నెంబర్ 36 గా లిస్ట్ అయ్యింది. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కవిత పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. తనకు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని ఆమె సవాల్ చేశారు. ఈడీ సమన్లు రద్దు చేయాలని, మహిళలను ఇంటి వద్దే విచారణ చేయాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కవిత కోరారు. ఈడీ విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నది కవిత విజ్ఞప్తి. ఈడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు. మరి దీనిపై సుప్రీం ఎలా స్పందిస్తుంది? విచారణపై స్టే విధిస్తుందా? లేక దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి నో చెబుతుందా ? లేక మహిళ అన్న కోణంలో ఏమైనా వెసులుబాట్లు కల్పిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవాళ్టి విచారణలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈనెల 14న సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌ వేయగా.. 15న ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుకు వచ్చింది. త్వరగా విచారణ చేపట్టాలని కవిత తరఫు న్యాయవాదులు కోరగా.. ఈ నెల27 జాబితాలో ఉందని కోర్టు స్పష్టం చేసింది.

కాగా, కవితను ఈడీ అధికారులు ఇప్పటి వరకు మూడుసార్లు విచారించారు. మూడు రోజులు మొత్తం 27 గంటలకు పైగా సుదీర్ఘ విచారణ సాగింది. మూడోరోజు విచారణ పూర్తయిన తర్వాత మళ్లీ విచారణ ఉంటే మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని కవితతో పాటు ఆమె న్యాయవాది సోమా భరత్‌కు వివరించింది ఈడీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..