AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్లీజ్ టీచర్ వెళ్లొద్దు.. ఉపాధ్యాయురాలు బదిలీపై వెళ్తుండగా తల్లడిల్లిన పసి హృదయాలు.. వీడియో

ఇన్ని రోజులు తమకు విద్యా బుద్దులు నేర్పుతూ.. అన్నీ తానై వారిలో ఒకరిగా ఉంటూ తల్లి తండ్రిలా ప్రేమను పంచిన ఆ టీచర్ బదిలీపై వెళుతుంటే..ఆ విద్యార్థులు గుండె బరువెక్కింది.. ఆ పసి హృదయాలు మౌనంగా విలపిస్తూ ప్లీజ్ టీచర్ వెళ్లొద్దు.. అంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు.

Telangana: ప్లీజ్ టీచర్ వెళ్లొద్దు.. ఉపాధ్యాయురాలు బదిలీపై వెళ్తుండగా తల్లడిల్లిన పసి హృదయాలు.. వీడియో
Teacher
N Narayana Rao
| Edited By: |

Updated on: Jul 03, 2024 | 2:48 PM

Share

ఇన్ని రోజులు తమకు విద్యా బుద్దులు నేర్పుతూ.. అన్నీ తానై వారిలో ఒకరిగా ఉంటూ తల్లి తండ్రిలా ప్రేమను పంచిన ఆ టీచర్ బదిలీపై వెళుతుంటే..ఆ విద్యార్థులు గుండె బరువెక్కింది.. ఆ పసి హృదయాలు మౌనంగా విలపిస్తూ ప్లీజ్ టీచర్ వెళ్లొద్దు.. అంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ కాలనీలోని ఇందిరానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మేకల జ్యోతి రాణి 11 ఏళ్లుగా ప్రభుత్వ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయురాలు బదిలీపై వెళ్తుంటే విద్యార్థులు కంటతడి పెట్టారు. గత నెల 19వ తేదీన జ్యోతిరానికి ప్రమోషన్ వచ్చింది.. టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలుగా ప్రమోషన్ లభించడంతో ఇందిరా నగర్ ప్రభుత్వ పాఠశాలలో రిలీవ్ వీడ్కోలు ఏర్పాటు చేశారు. 2013 సంవత్సరం నుంచి పాఠశాల బలోపేతానికి కృషిచేసిన ఉపాధ్యాయురాలు తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న క్రమంలో విద్యార్థులు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు.

టీచర్ మీరు ఎక్కడికి పోవద్దు.. మాతోనే ఉండాలి.. మీరే మాకు పాఠాలు చెప్పాలి.. మీరు లేని ఈ బడికి రాబోము… అంటూ ఉపాధ్యాయురాలిని పట్టుకుని కన్నీరుమున్నీరయ్యారు. దీంతో ఉపాధ్యాయురాలు జ్యోతి రాణి కూడా కంటతడి పెట్టారు. ఉపాధ్యాయురాలు జ్యోతి రాణి టీచర్ వెళ్లిపోతుంటే ఆమెను పట్టుకొని ఒక్కసారిగా విద్యార్థులు రోదనలతో మిన్నంటాయి.

వీడియో చూడండి..

భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలంలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యాలయాలు పదుల సంఖ్యలో ఉన్నప్పటికీ 8 మంది ఉన్న పాఠశాలను 120 కి ప్రవేశాలు పెంచి కార్పొరేట్ పాఠశాల మాదిరిగా తీర్చిదిద్దారు ఉపాధ్యాయురాలు జ్యోతి రాణి.. చిన్నారులను సముదాయిస్తూ.. తాను ఎక్కడికి వెళ్ళనని.. మీకు ఎప్పటికైనా అందుబాటులో ఉంటాను అని సర్ది చెప్పి కన్నీటితో ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోయారు జ్యోతిరాణి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?