AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూలై 24న తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు.. ఎందుకంటే?

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జూలై 24న విద్యాసంస్థల బంద్ నిర్వహించనున్నట్లు పలు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. AISF, SFI, NSUI, PDSU, AIFDS, AISB, AIPSU సంఘాలు సంయుక్తంగా ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యార్థుల సమస్యలు, విద్యా రంగానికి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.

జూలై 24న తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు.. ఎందుకంటే?
Telangana Educational Institutions Bundh
Balaraju Goud
|

Updated on: Jul 22, 2026 | 6:41 PM

Share

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జూలై 24న విద్యాసంస్థల బంద్ నిర్వహించనున్నట్లు పలు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. AISF, SFI, NSUI, PDSU, AIFDS, AISB, AIPSU సంఘాలు సంయుక్తంగా ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యార్థుల సమస్యలు, విద్యా రంగానికి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.

ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసు చర్యలపై పారదర్శక విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడం సరికాదని, ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాయి. అలాగే నీట్, ఇతర పోటీ పరీక్షల నిర్వహణలో తలెత్తిన సమస్యలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

విద్యా రంగానికి సంబంధించిన మరికొన్ని అంశాలపై కూడా సంఘాలు తమ నిరసనను వ్యక్తం చేశాయి. ముఖ్యంగా VBSA బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో జూలై 24న జరిగే బంద్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని విద్యార్థి సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలపై ఈ బంద్ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా, విద్యార్థి సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us