DGP Mahender Reddy: అనవసరంగా రోడ్లపైకి రావొద్దు.. లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: డీజీపీ మహేందర్ రెడ్డి

|

Jun 01, 2021 | 8:10 PM

Telangana DGP Mahender Reddy: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ పటిష్టంగా అమలవుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని

DGP Mahender Reddy: అనవసరంగా రోడ్లపైకి రావొద్దు.. లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: డీజీపీ మహేందర్ రెడ్డి
Dgp Mahender Reddy
Follow us on

Telangana DGP Mahender Reddy: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ పటిష్టంగా అమలవుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మహేందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మంగళవారం కూకట్‌పల్లి జెఎన్‌టీయూ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను సైబరాబాద్ సీపీ సజ్జనార్‌తో కలిసి డీజీపీ మహేందర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య దృష్ట్యా లాక్‌డౌన్‌ను కొనసాగిస్తుందని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా వైరస్ చైన్ బ్రేక్ చేసే దిశగా ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుందని.. దానిలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలందరూ తమకు సహకరించాలని అనవసరంగా రోడ్లపైకి రావద్దని డీజీపీ సూచించారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు.. జనసాంద్రత కలిగిన కమిషనరేట్స్‌, హైదరాబాద్ పరిధిలల్లో కఠినంగా పోలీసులు లాక్ డౌన్ అమలు చేస్తున్నారని డీజీపీ వెల్లడించారు. మూడు కమిషనరేట్ పరిధిలో పోలీసులు పటిష్టంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. సడలింపు సమయం అనంతరం లాక్‌డౌన్‌లో అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు.

అంబులెన్సులు, ఎసెన్షియల్ వెహికల్స్, డాక్టర్స్, పారామెడికల్ సిబ్బంది, వ్యాక్సినేషన్ కి వెళ్లే వారికి మినిహాయింపు ఇచ్చినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. డీజీపీ వెంట సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏడీసీపీ మాణిక్ రాజ్ తదితరులు ఉన్నారు.

Also Read:

ఆ తండ్రికి ఎంత కష్టం.. కుమారుడికి రక్తం కోసం సైకిల్‌పై ఏకంగా 400 కి.మీ ప్రయాణం.. ఎక్కడంటే..?

బేఫికర్ ! కోవిద్ రూల్స్ కి ‘పాతర’…కూతురి ప్రీ-వెడ్డింగ్ పార్టీలో బీజేపీ ఎమ్మెల్యే ‘జాతర’…60 మందిపై కేసు నమోదు