Congress Party: అభయహస్తం అప్లికేషన్లపై అధికారుల నిర్లక్ష్యం.. రేవంత్ సర్కార్ సీరియస్..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ప్రజాపాలన. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదలు అనేక సమీక్షలు జరుపుతూ పాలన కోనసాగిస్తున్నారు. ఇప్పటికే నెలరోజుల పాలనలో చెప్పుకోదగ్గ నిరసనలు, ఇబ్బందులు లేనప్పటికీ.. అభయ హస్తం కార్యక్రమంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. కొందరికి అభయహస్తం దరఖాస్తు ఫారమ్ లు అందక చాల మంది డబ్బులు చెల్లించి కొనుగోలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ప్రజాపాలన. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదలు అనేక సమీక్షలు జరుపుతూ పాలన కోనసాగిస్తున్నారు. ఇప్పటికే నెలరోజుల పాలనలో చెప్పుకోదగ్గ నిరసనలు, ఇబ్బందులు లేనప్పటికీ.. అభయ హస్తం కార్యక్రమంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. కొందరికి అభయహస్తం దరఖాస్తు ఫారమ్ లు అందక చాల మంది డబ్బులు చెల్లించి కొనుగోలు చేశారు. జిరాక్స్ షాపుల్లో డిమాండ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈవిషయం సీఎం దృష్టికి రావడంతో సీరియస్ గా వర్నింగ్ ఇచ్చారు. పేదవాడి అవసరాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం రేవంత్.
ఇదిలా ఉంటే మొన్నటి వరకూ సాగిన ప్రజాపాలన కార్యక్రమంలో కోటి మందికిపైగా దరఖాస్తులు చేసుకున్నారు. తాజాగా అభయ హస్తం దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల మీద చర్యలకు ఉపక్రమించింది జీహెచ్ఎంసీ. బాలనగర్ ఫ్లై ఓవర్ పై చల్లాచెదురుగా పడిపోయిన అభయ హస్తం దరఖాస్తు ఫారంలను చూసి షాక్ అయ్యారు అధికారులు. దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేసే అలోచనలో ఉన్నారు బల్ధియా అధికారులు. ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై సర్కార్ సీరియస్ అయింది. ఈ ఘటనపై పూర్తి వివరాలను అందజేయాలని డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్ ను ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్. డిప్యూటీ కమిషనర్, ఏఎంసీ, ట్యాక్స్ సూపరిండెంట్ పై సస్పెన్షన్ వేటు వేసే అలోచనలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..