Viral: ఇదేం వాడకం మావా.! టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రీ-వెడ్డింగ్ షూట్.. వీడియో వైరల్..

ఒకప్పుడు పెళ్లంటే.. బంధుమిత్రులు, పెద్దల సమక్షంలో సందడిగా జరిగేది. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లి అనే మధురమైన జ్ఞాపకం జీవితాంతం గుర్తుండిపోయేలా నేటి యువత వీడియోలు, ఫోటోలు తీసుకోవడంతో పాటు.. ప్రీ-వెడ్డింగ్ షూట్స్‌ను విపరీతంగా ఫాలో అవుతున్నారు.

Viral: ఇదేం వాడకం మావా.! టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రీ-వెడ్డింగ్ షూట్.. వీడియో వైరల్..
Pre Wedding Photoshoot
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 09, 2024 | 1:49 PM

ఒకప్పుడు పెళ్లంటే.. బంధుమిత్రులు, పెద్దల సమక్షంలో సందడిగా జరిగేది. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లి అనే మధురమైన జ్ఞాపకం జీవితాంతం గుర్తుండిపోయేలా నేటి యువత వీడియోలు, ఫోటోలు తీసుకోవడంతో పాటు.. ప్రీ-వెడ్డింగ్ షూట్స్‌ను విపరీతంగా ఫాలో అవుతున్నారు. ఫోటోగ్రాఫర్ తన క్రియేటివిటీకి పదునుపెడుతూ.. చుట్టూ ఉన్న ప్రోప్స్‌ను ఉపయోగించుకుని షూటింగ్స్ చేస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా ఓ జంట రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లను, టీఎస్ఆర్టీసీ బస్సును ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం వాడేశారు.

ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్స్.. ఈ మధ్యకాలంగా బాగా ట్రెండ్ అవుతున్నాయి. దీనికి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే. ఫోటోగ్రాఫర్లు ప్రత్యేకించి.. తమ బుర్రకు పదునుపెట్టి.. నూతన వధూవరులకు గుర్తుండిపోయే రీతిలో ఫోటోలు, వీడియోలు తీసి.. వాటికి సినిమా పాటలను జోడిస్తుంటారు. కొందరు ఎంచుకున్న కాస్ట్యూమ్స్, థీమ్స్ ట్రోల్స్‌కు కేరాఫ్‌గా మారితే.. మరికొందరివి అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఇక ఇప్పుడు ఓ జంట హైదరాబాద్‌ రోడ్లపై, ఆర్టీసీ బస్సులో ఈ ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ తీయించుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం దానిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్ చేస్తున్నారు. కొందరు పాజిటివ్‌గా వారి క్రియేటివిటీని మెచ్చుకుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యాన్ని ట్యాగ్ చేసి.. యాక్షన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా వీడియో చూసేయండి.. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం చెప్పండి.