Road Safety: తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ అధికారికి లైఫ్ టైమ్ అవార్డుతో సత్కారం.. రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో..

|

Feb 25, 2023 | 9:05 PM

ఏటా రోడ్డు ప్రమాదాల సంఖ్య బారిగా పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాల బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

Road Safety: తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ అధికారికి లైఫ్ టైమ్ అవార్డుతో సత్కారం.. రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో..
Srinivs Puppala
Follow us on

ఏటా రోడ్డు ప్రమాదాల సంఖ్య బారిగా పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాల బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మనదేశంలో గణాంకాలు.. రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయని పలు నివేదికలు  చెబుతున్నాయి. గుజరాత్‌లోనే కాదు, ఇతర రాష్ట్రాలలోనూ రోడ్డు ప్రమాదాలు బాగా పెరుగుతున్నాయి. ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించడం ఎలా అనే అంశంపై.. గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఓ హోటల్‌లో ‘రహదారి – భద్రత’ (Road Safety) అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్త్ సేఫ్టీ అండ్ సస్టైనబుల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుజరాత్ తో పాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్ శ్రీనివాస్ పుప్పాల పాల్గొన్నారు. ప్రమాదాలను నియంత్రించడం ఎలా ? మరణాల సంఖ్యను ఎలా తగ్గించాలి..? రోడ్డు డిజైన్ ఎలా ఉండాలి? ఎలాంటి ట్రాఫిక్‌ నిర్వహణ చేపట్టాలి? వంటి పలు అంశాలపై ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చర్చించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శ్రీనివాస్ పుప్పాలను రోడ్ సేఫ్టీ ప్రతినిధులు అభినందించారు. ట్రాఫిక్ అవగాహన, ప్రమాదాల నివారణ కోసం కృషి చేసినందుకు శ్రీనివాస్ కు లైఫ్ టైమ్ అవార్డుతో సత్కరించారు. ఆయనతో పాటు మరికొందరు ప్రతినిధులను కూడా అవార్డులతో సత్కరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..