Sputnik V Vaccine: మూడో దశ ట్రయల్స్‏కు‏ ‘స్పుత్నిక్- వీ’ వ్యాక్సిన్.. అనుమతినిచ్చిన డీజీసీఐ…

|

Jan 16, 2021 | 7:26 AM

దేశ వ్యాప్తంగా స్పుత్నిక్ -వీ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‏కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చినట్లు రెడ్డీస్ లాబొరేటరి తెలిపింది.

Sputnik V Vaccine: మూడో దశ ట్రయల్స్‏కు‏ స్పుత్నిక్- వీ వ్యాక్సిన్.. అనుమతినిచ్చిన డీజీసీఐ...
Follow us on

దేశ వ్యాప్తంగా స్పుత్నిక్ -వీ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‏కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చినట్లు రెడ్డీస్ లాబొరేటరి తెలిపింది. మూడో దశ ట్రయల్స్‏లో దేశంలోని 1500 మందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. డేటా అండ్ సేఫ్టీ మానిటరింగ్ బోర్ట్ (డీఎస్ఎంబీ) తొలి దశ, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నుంచి డేటాను పరీక్షించిన అనంతరం మూడో దశ ప్రయోగాల కోసం అప్పీలు చేసింది. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పురోగతిలో ఇదో ముఖ్యమైన మైలురాలు. ఇక జనవరిలో మూడో దశ ట్రయల్స్ ప్రారంభించాలని భావిస్తున్నాం అని రెడ్డీస్ లాబొరేటరీ కో చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు.

గతేడాది రష్యాకు చెందిన ఓ మెడిసిన్ సంస్థ ఈ స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‏ను అభివృద్ధి చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, ఉత్పత్తి కోసం రెడ్డీస్ సంస్థ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‏మెంట్ ఫండ్‏తో గతంలో ఒప్పందం చేసుకుంది. గమలేయ నేషనల్ రీసెర్చ్ ఇన్‏స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ స్పుత్నిక్-వీ పేరుతో దీనిని అభివృద్ధి చేసింది. అడెనోవైరల్ వెక్టర్ ఫ్లాట్ ఫాం ఆధారంగా కొవిడ్-19కు వ్యతిరేకంగా ప్రపంచంలోనే మొట్టమొదటి రిజిస్టర్డ్ వ్యాక్సిన్‏గా ఇది నిలిచింది. అంతేగాక రష్యాలోని క్లినికల్ ట్రయల్స్‏లో భాగంగా ఇది 91.4 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. అటు దేశ ప్రజల కోసం సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్‏ను తీసుకువచ్చేందుకు కృషిచేస్తామని రెడ్డీస్ లాబొరేటరీస్ కో చైర్మన్ తెలిపారు.

Also Read: మూడో దశ ట్రయల్స్ లో ‘కోవాగ్జిన్’, తొలి, రెండో దశ ట్రయల్స్ విశ్లేషణ సక్సెస్, భారత్ బయోటెక్

Russia Covid Vaccine: ‘అదిగో స్పుత్నిక్’ ! రష్యా నుంచి కాన్పూర్ కి వచ్ఛేవారం వ్యాక్ సీన్ ! రెండో దశ ట్రయల్స్ రెడీ ?