Today Petrol Price: పెద్దగా మార్పు లేని ఇంధన ధరలు… ఈ రోజు పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయంటే..
Today Petrol Price: గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోన్న పెట్రోల్, డీజీల్ ధరలకు శనివారం కాస్త బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. పెట్రోల్, డీజీల్ ధరలను రోజువారీగా సవరిస్తోన్న నేపథ్యంలో.. ప్రతిరోజూ ఇంధన ధరల్లో మార్పులు వస్తున్నాయి...
Today Petrol Price: గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోన్న పెట్రోల్, డీజీల్ ధరలకు శనివారం కాస్త బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. పెట్రోల్, డీజీల్ ధరలను రోజువారీగా సవరిస్తోన్న నేపథ్యంలో.. ప్రతిరోజూ ఇంధన ధరల్లో మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రోజు రోజుకీ స్వల్ప మొత్తంలో పెట్రోల్, ధరలు తగ్గడమో, పెరగడమే జరుగుతోంది. ఇక తాజాగా శనివారం దేశ వ్యాప్తంగా ఎలా ఉన్నాయన్న దానిపై ఓ లుకేయండి మరి..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.88.11 ఉండగా, డీజీల్ ధర రూ. 81.72 గా పలికింది. ఇక వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.87.66 ఉండగా, డీజీల్ ధర రూ.81.29గా ఉంది.
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర. 90.83 ఉండగా, లీటర్ డీజీల్ రూ.83.96గా ఉంది. విశాఖపట్నంలో శనివారం లీటర్ పెట్రోల్ ధర. 89.64 పలకగా, డీజీల్ రూ.82.80 గా నమోదైంది. ఇక గుంటూరులో లీట్ పెట్రోల్ ధర రూ.90.83 ఉండగా, డీజీల్ విషయానికొస్తే రూ. 83.96గా పలికింది.
ఇక దేశరాజధాని ఢిల్లీ విషయానికొస్తే లీటర్ పెట్రోల్ ధర రూ. 84.70 కాగా డీజీల్ ధర రూ.74.88 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.32 కాగా, లీటర్ డీజీల్ ధర రూ.81.60 గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.87.40 ఉండగా, డీజీల్ ధర రూ.80.19గా నమోదైంది.