AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SCR: ఆదాయంలో దుమ్మురేపుతోన్న దక్షిణ మధ్య రైల్వే.. మే నెలలో రికార్డు వసూళ్లు. ఏకంగా..

దక్షిణ మధ్య రైల్వే 2023 మే నెలకుగాను ప్రయాణికులు, సరుకు రవాణా విభాగంలో వసూళ్లలో సరికొత్త రికార్డు సృష్టించింది. జోన్ మొదటి సారిగా నెలవారీ ప్రయాణీకుల ఆదాయంలో రూ. 500 కోట్ల మార్కును అధిగమించింది. ప్రయాణికుల ఆదాయం మే నెలలో రూ. 513.41 కోట్లు ఆర్జించింది...

SCR: ఆదాయంలో దుమ్మురేపుతోన్న దక్షిణ మధ్య రైల్వే.. మే నెలలో రికార్డు వసూళ్లు. ఏకంగా..
South Central Railway
Narender Vaitla
|

Updated on: Jun 01, 2023 | 4:52 PM

Share

దక్షిణ మధ్య రైల్వే 2023 మే నెలకుగాను ప్రయాణికులు, సరుకు రవాణా విభాగంలో వసూళ్లలో సరికొత్త రికార్డు సృష్టించింది. జోన్ మొదటి సారిగా నెలవారీ ప్రయాణీకుల ఆదాయంలో రూ. 500 కోట్ల మార్కును అధిగమించింది. ప్రయాణికుల ఆదాయం మే నెలలో రూ. 513.41 కోట్లు ఆర్జించింది. ఏప్రిల్‌ నెలలలో రూ. 467.82 కోట్లు రాబట్టింది. ఇక సరకుల రవాణా విషయంలోనూ మునుపెన్నడూ లేని విధంగా లాభాలు ఆర్జించింది. మే నెలలో 12.517 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేపట్టడం జరిగింది.

ఇక దక్షిణ మధ్య రైల్వే 2023 మే నెలలో 26.11 మిలియన్ల మంది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేరవేసింది. గత 2022 మే నెలలో 21.12 మిలియన్ల ప్రయాణికులతో పోలిస్తే 24% వృద్ధిని సాధించింది. సాధారణ రైళ్లు కాకుండా వేసవి కాలంలో అదనపు రద్దీ అవసరాలను తీర్చడానికి మే నెలలో జోన్ 538 ట్రిప్పుల ప్రత్యేక రైళ్లను నడిపింది. ఇది అదనంగా 4.65 లక్షల మంది ప్రయాణీకులను రవాణా చేయడం ద్వారా రూ. 36.52 కోట్ల ఆదాయం సంపాదించింది. సరుకు రవాణా విభాగంలో మే 2023లో 12.517 ఎమ్‌టిలు సరుకును రవాణా చేసింది, ఇది ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా ఒక నెలలో సాధించిన అత్యుత్తమ సరుకు రవాణా లోడింగ్. గత సంవత్సరం నమోదైన సంబంధిత లోడింగ్ కంటే ఇది దాదాపు 7% ఎక్కువ.

అదే సమయంలో, సరుకు రవాణా ఆదాయం ఈ ఏడాదిలో 14% వృద్ధి చెంది రూ. మే, 2023లో రూ .1213.36 కోట్లు నమోదు చేసింది. గత ఏడాది మే, 2022 లో 1065.15 కోట్లు నమోదు చేసింది. దక్షిణ మధ్య రైల్వే మొత్తం సరుకు రవాణాలో సిమెంట్ (3.106 ఎమ్ టిలు), ఆహార ధాన్యాలు (0.444 ఎమ్ టిలు), ఎరువులు (0.740 ఎమ్ టిలు), ఇనుప ఖనిజం (0.363 ఎమ్ టిలు), కంటైనర్లు (0.211 ఎమ్ టిలు) ప్రథమ స్థానంలో నిలిచాయి. దక్షిణ మధ్య సాధించిన ఈ విజయం పట్ల జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ సంతోషం వ్యక్తం చేశారు. ఆపరేటింగ్,వ కమర్షియల్ టీంలను అభినందించారు. జోన్లో ప్రతి నెల ఉత్తమ పనితీరు నమోదవుతున్న తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..