Telangana: కనికరం చూపని కొడుకు.. కన్న తల్లినే ఇంటి నుంచి గెంటేశాడు

అతనికి కన్నతల్లి భారమైంది. వృద్ధాప్యంలో చూసుకోవాల్సిన కొడుకు.. పొమ్మంటున్నాడు. నవ మాసాలు మోసి కని పెంచిన కొడుకు కన్నతల్లిపై కొంచెం కూడా కనికరం చూపలేదు. అనారోగ్యంతో ఉన్న వృద్ధురాలకి ఆసరాగా ఉండాల్సిన కొడుకు, కోడలు వెళ్లిపొమ్మని ఇంటి నుండి గెంటి వేశారు. ఆకలితో అలమటిస్తున్నా తల్లికి అన్నం పెట్టడం లేదు కానీ.. ఇంటి ముందుకు వచ్చిన కోతికి మాత్రం అన్నం దొరికింది. కొడుకు ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నది తల్లి. ఆరుగురు కూతుర్లు, కుమారుడు ఉన్న ఆమె ఇప్పుడు ఒంటరి అయింది.

Telangana: కనికరం చూపని కొడుకు.. కన్న తల్లినే ఇంటి నుంచి గెంటేశాడు
Mallikamba

Edited By: Aravind B

Updated on: Sep 04, 2023 | 5:16 PM

భద్రాద్రి కొత్తగూడెం న్యూస్, సెప్టెంబర్ 4: అతనికి కన్నతల్లి భారమైంది. వృద్ధాప్యంలో చూసుకోవాల్సిన కొడుకు.. పొమ్మంటున్నాడు. నవ మాసాలు మోసి కని పెంచిన కొడుకు కన్నతల్లిపై కొంచెం కూడా కనికరం చూపలేదు. అనారోగ్యంతో ఉన్న వృద్ధురాలకి ఆసరాగా ఉండాల్సిన కొడుకు, కోడలు వెళ్లిపొమ్మని ఇంటి నుండి గెంటి వేశారు. ఆకలితో అలమటిస్తున్నా తల్లికి అన్నం పెట్టడం లేదు కానీ.. ఇంటి ముందుకు వచ్చిన కోతికి మాత్రం అన్నం దొరికింది. కొడుకు ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నది తల్లి. ఆరుగురు కూతుర్లు, కుమారుడు ఉన్న ఆమె ఇప్పుడు ఒంటరి అయింది. అక వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సుభాష్ నగర్ ఏరియాలో చిలువేరు మల్లికాంబ రాములు దంపతులకు ఆరుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కూతుళ్లు, కుమారుడు ఇలా అందరికీ వివాహాలు జరిగిపోయాయి. 20 సంవత్సరాల క్రితమే రాములు మృతి చెందాడు.

భర్త జరిగిపోయిన తర్వాత కూడా నలుగురు కూతుళ్ళ వివాహం జరిపించింది వృద్ధురాలు మల్లికాంబ. స్థానికంగా బోర్ వాహనాల ఓనర్ రమేష్.. తన తల్లి పట్ల ప్రేమ చూపకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో వృద్ధురాలు గత కొన్ని రోజులుగా కూతుర్ల వద్దే ఉంటుంది. రాను రాను మల్లికాంబ అనారోగ్యానికి గురి కావడంతో పేద కుటుంబాల్లో ఉన్న కూతుర్లకు తల్లిని పోషించడం భారమైంది. దీంతో కుమార్తెలు.. కొడుకు రమేష్ ఇంటికి తల్లిని తీసుకురాగా రమేష్ ఆగ్రహంతో తల్లిని ఇంటి నుంచి నెట్టి వేశాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వృద్ధురాలు కొడుకు ఇంటిముందే పడుకొని అలమటిస్తుంది, తల్లిని ఇబ్బంది పెడుతున్న విషయాన్ని స్థానిక పోలీసులకు కూతుర్లు ఫిర్యాదు చేశారు. తల్లిని పోషించే విషయంలో నిర్లక్ష్యం వహించిన కుమారునిపై చర్యలు తీసుకోవాలని ఆరుగురు కూతుర్లు తల్లికి మద్దతుగా నిలిచారు. నాకు న్యాయం జరిగే వరకు ఇంటిముందే కూర్చొని ఉంటానని రోడ్డు పక్కనే దీనంగా కూర్చుంది.

అయితే కొడుకు రమేష్ తల్లిపై వ్యవహరిస్తున్న తీరుపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవ మాసాలు పెంచిన తల్లిని ఇంటి నుంచి బయటకి గెంటేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవిషయం ఏంటంటే ఆ తల్లి ఇప్పటికే అనారోగ్యంతో ఉంది. అయితే ఆ తల్లి కూతర్లు తమ సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇది ఉండగా ఏది ఏమైనా కన్న తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వెళ్లినప్పుడు వాళ్లని చూసుకోవాల్సిన బాధ్యత కొడుకులపైనే ఉంటుంది. మరికొన్ని చోట్ల కూడా ఇలా కన్న తల్లులనే ఇంటి నుంచి బయటికి గెంటేసిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా వృద్ధాశ్రమాల్లో కన్న కొడుకులు గెంటేసిన తల్లలు కూడా ఎందరో అక్కడ కనిపిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..