హనుమకొండ జిల్లా, అక్టోబర్ 12: హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాలతో అత్తను కాల్చి చంపాడు పోలీస్ కానిస్టేబుల్. ఈ కాల్పుల సంఘటన హన్మకొండలోని గుండ్ల సింగారం ఇందిరమ్మకాలనీలో జరిగింది. ప్రసాద్ అనే కానిస్టేబుల్ తన అత్త కమలపై రివాల్వర్ తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అత్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కాల్పులను గమనించిన స్థానికులు ఆ కానిస్టేబుల్ పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు.
కాల్పులు జరిపిన ప్రసాద్ ప్రస్తుతం రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని తోటపల్లి పీఎస్ లో విధులు నిర్వహిస్తున్నాడు.. గుండ్ల సింగారం ప్రాంతానికి చెందిన రమ అనే మహిళతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య కలహాలు కొనసాగుతున్నాయి. మహిళా పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేసింది.
విచారణ కొనసాగుతున్న క్రమంలోనే ప్రసాద్ ఈరోజు గుల్లసింగారంలోని తన అత్తగారింటికి వచ్చాడు.. తన డబ్బులు తనకు ఇవ్వాలని అడిగాడు.. ఈ క్రమంలోనే అత్త అల్లుడి మధ్య కొంతసేపు వాగ్వివాదం జరిగింది.. ఈ క్రమంలో పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న సర్వీస్ రివాల్వర్ తో అత్తను కాల్చి చంపాడు.. రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో అత్త కమల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.. వెంటనే గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని కానిస్టేబుల్ ప్రసాద్ పై కానిస్టేబుల్ ను చితక బాదారు.. రాయితో కొట్టారు.. ప్రస్తుతం కాల్పులు జరిపిన ప్రసాద్ తీవ్రగాయాలతో ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ హత్యకు కేవలం అత్త అల్లుడి మధ్య ఆర్థిక లావాదేవీలు. భార్యా-భర్తల మధ్య కలహాలే కారణం… ప్రసాద్ మద్యానికి బానిసగా మారడంతో బార్య తన బిడ్డలతో తల్లి వద్దే ఉంటోందని స్థానికులు చెబుతున్నారు..అయితే ప్రసాద్ చేతికి సర్వీస్ రివాల్వర్ ఎలా వచ్చింది.? ఎక్కడినుండి ఈ సర్వీస్ రివాల్వర్ తీసుకొచ్చాడు..? రివాల్వర్ ఎవరు ఇచ్చారు అనే కోణంలో విచారణ కొనసాగుతుంది..
ప్రసాద్ ఆ రివాల్వర్ తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లో దొంగిలించడా…? లేక ఎవరైనా ఎస్సై లేదా ఆపై స్థాయి స్థాయి అధికారుల రివాల్వర్ వారికి చెప్పకుండా తస్కరించాడా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.. ప్రస్తుతం అనువవునా చెకింగ్ లు కొనసాగుతున్న క్రమంలో తోటపల్లి నుండి రివాల్వర్ తో ఎలా ఇంత దూరం తీసుకొచ్చి కాల్పులు జరిపాడు అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన అటు డిపార్ట్మెంట్ లో.. ఇటు స్థానికంగా ఒక్కసారిగా కలకలం సృష్టించింది..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి