AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rangareddy District: రంగారెడ్డి నేలలో అద్భుతం – క్యాన్సర్ విరుగుడు బ్యాక్టీరియా గుర్తింపు

రంగారెడ్డి జిల్లా నేలలో దాగున్న జీవకణాలు ప్రపంచాన్ని భయపెడుతున్న క్యాన్సర్‌కు చెక్ పెట్టే మార్గాన్ని చూపిస్తున్నాయంటే నమ్మగలరా? శాస్త్రవేత్తలు గుర్తించిన ప్రత్యేక బ్యాక్టీరియా జాతులు ప్రాణాంతక క్యాన్సర్ చికిత్సలో గేమ్‌చేంజర్‌గా మారే అవకాశముందంటున్నారు. ఆ ఇంట్రస్టింగ్ డీటేల్స్ ఈ కథనంలో తెలుసుకుందాం.

Rangareddy District: రంగారెడ్డి నేలలో అద్భుతం - క్యాన్సర్ విరుగుడు బ్యాక్టీరియా గుర్తింపు
Soil
Ram Naramaneni
|

Updated on: Jul 21, 2025 | 2:40 PM

Share

క్యాన్సర్ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. విభిన్న రకాల క్యాన్సర్స్ మనుషులపై దండెత్తుతున్నాయి. జీవనశైలి మార్పులు, పర్యావరణ కాలుష్యం, అవగాహన లోపం, ఆలస్యంగా నిర్ధారణ వంటి కారణాల వల్ల ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ప్రతి ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్‌లోనూ పరిస్థితి భయానకంగా మారుతోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్‌కు చెక్ చెప్పే ఓ అద్భుత ప్రకృతి వరం తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని వ్యవసాయ భూముల రైజోస్ఫియర్ నేల నుంచి శాస్త్రవేత్తలు సేకరించిన సూక్ష్మజీవుల్లో అద్భుత ఔషధ గుణాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో కొన్ని బ్యాక్టీరియా జాతులు క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే సహజ సమ్మేళనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది.

ఈ పరిశోధనను తమిళనాడు రాష్ట్రానికి చెందిన అలగప్ప విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డా. సంజీవ్ కుమార్ సింగ్ నేతృత్వంలో జట్టు నిర్వహించింది. రంగారెడ్డి నేలలో నుంచి క్లెబ్సియెల్లా న్యుమోనియే, క్లెబ్సియెల్లా క్వాసిన్యుమోనియే, స్ట్రెప్టోమైసెస్ మినుటిస్క్లెరోటికస్, స్ట్రెప్టోమైసెస్ ప్యూసెటియస్ వంటి నాలుగు ప్రత్యేక బ్యాక్టీరియా జాతులు గుర్తించారు.

ఈ జాతుల జన్యు స్థాయి విశ్లేషణ కోసం జన్ బ్యాంక్‌లో టెస్టులు నిర్వహించారు. ముఖ్యంగా స్ట్రెప్టోమైసెస్ ప్యూసెటియస్ అనే జాతి అత్యధిక యాంటీ-క్యాన్సర్ యాక్టివిటీని చూపించింది. ఈ బ్యాక్టీరియా ప్యూసెమైసిన్ అనే సహజ సమ్మేళనాన్ని ఉత్పత్తి చేస్తుందని.. దీనికి యాంటీ-బాక్టీరియల్, యాంటీ-ట్యూమర్ లక్షణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇవి బయోటెక్నాలజీ ఆధారిత ప్రక్రియల ద్వారా క్యాన్సర్, సూక్ష్మజీవ జబ్బుల చికిత్సకు వాడతగిన ఔషధ సమ్మేళనాలుగా మారే అవకాశం ఉంది.

ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో క్యాన్సర్‌కు చికిత్సలో పెద్ద మైలురాయిగా మారవచ్చని శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మన నేలలో దాగి ఉన్న ఔషధ గుణాల్ని పరిశోధనలు వెలికి తీయడం ద్వారా ప్రపంచానికి ఉపయోగపడే కొత్త మార్గాలు అందుబాటులోకి రావడం ఆశాజనక పరిణామంగా చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..