హైదరాబాద్‌లో బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ.. ఇన్సోఫీ ఎదుట 700 మంది ఉద్యోగుల ఆందోళన

|

Apr 18, 2023 | 1:57 PM

ఇన్సోఫీ కంపెనీలో మొత్తం 700 మంది ఉద్యోగులు ఉన్నారు. 650 మంది పేరుతో 4 లక్షల రూపాయలు చొప్పున.... 50 మంది పేరుతో రూ. 10 లక్షల చొప్పున ఇన్సోఫీ కంపెనీ లోన్ తీసుకుంది.

హైదరాబాద్‌లో బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ.. ఇన్సోఫీ ఎదుట 700 మంది ఉద్యోగుల ఆందోళన
Software Company
Follow us on

హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ బోర్డు తిప్పేసింది. గచ్చిబౌలిలోని ఇన్సోఫీ సాఫ్ట్‌వేర్ కంపెనీ నుంచి ఉద్యోగులను తీసివేస్తున్నట్లు వారికి మెయిల్ పంపింది. ఆఫీస్ అండర్ మెయింటేనెన్స్ అని బోర్డ్ పెట్టింది. దీంతో షాక్‌ అయిన ఉద్యోగులు గచ్చిబౌలిలోని ఇన్సోఫీ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. ఇన్సోఫీ కంపెనీలో మొత్తం 700 మంది ఉద్యోగులు ఉన్నారు. 650 మంది పేరుతో 4 లక్షల రూపాయలు చొప్పున…. 50 మంది పేరుతో రూ. 10 లక్షల చొప్పున ఇన్సోఫీ కంపెనీ లోన్ తీసుకుంది.

ఇవి కూడా చదవండి

ఏడాదిన్నరగా సంస్థ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలేదు. జీతాలు అడుగుతుంటే ఇవ్వకుండా…సాలరీ కింద మీ లోన్ emi కడుతున్నామని చెప్పింది సదరు కంపెనీ.. ఇప్పుడు ఏకంగా కంపెనీయే మూతపడిందని తమ పరిస్థితి ఏంటని ఉద్యోగులు వాపోతున్నారు.