Railway News: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల మధ్య దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ మధ్య మరో ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు బుధవారం నాడు ద.మ.రైల్వే అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్ – నరసాపూర్, నరసాపూర్ – వికారాబాద్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. ప్రత్యేక రైలు (నెం.07631) జులై 16, 23, 30 తేదీల్లో(శనివారం) రాత్రి 11.30 గం.లకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.35 గం.లకు నరసాపూర్‌కు చేరుకుంటుంది. అలాగే ప్రత్యేక రైలు (నెం.07632) జులై 17,24,31 తేదీల్లో (ఆదివారం) రాత్రి 08.00 గం.లకు నరసాపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గం.లకు వికారాబాద్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్ – నరసాపూర్ (3 సర్వీసులు) ప్రత్యేక రైలు నెం.07631 కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
అలాగే నరసాపూర్ – వికారాబాద్ (3 సర్వీసులు) ప్రత్యేక రైలు నెం.07632 పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని ద.మ.రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఓ ప్రకటనలో తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..