Singareni Jobs 2023: సింగరేణి బొగ్గుగనుల్లో అప్రెంటిస్‌ ఖాళీలు.. టెన్త్‌/ఐటీఐ పాసైన వారు దరఖాస్తుకు అర్హులు

|

Jun 16, 2023 | 8:43 PM

SCCL Apprentice recruitment 2023: తెలంగాణ, కొత్తగూడెలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్2023-24 సంవత్సరానికిగానూ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్,..

Singareni Jobs 2023: సింగరేణి బొగ్గుగనుల్లో అప్రెంటిస్‌ ఖాళీలు.. టెన్త్‌/ఐటీఐ పాసైన వారు దరఖాస్తుకు అర్హులు
Singareni Collieries Company
Follow us on

SCCL Apprentice recruitment 2023: తెలంగాణ, కొత్తగూడెలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్2023-24 సంవత్సరానికిగానూ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్‌లు, టర్నర్‌, మెషినిస్ట్‌, మెకానిక్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (సివిల్), మెకానిక్ డీజిల్, మౌల్డర్, వెల్డర్ తదితర ట్రేడుల్లో అప్రెంటిస్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు తన ప్రకటనలో తెల్పింది.

పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అలాగే 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. 1995 మే 31కి ముందు జన్మించినవారు దరఖాస్తుకు అనర్హులు.

ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ జూన్‌ 28, 2023గా ప్రకటించింది. అనంతరం నింపిన దరఖాస్తు కాపీని డౌన్‌లోడ్‌ చేసుకుని జూన్‌ 30వ తేదీలోపు పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా కూడా అందించవచ్చు. అదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మంలోని సంబంధిత ఎంవీటీసీ కేంద్రాల అడ్రస్‌లలో దరఖాస్తులను పంపించాలి. ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన సీనియారిటీ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సీనియారిటీ ప్రకారం అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే ఐటీఐ మార్కులను పరిగణణలోకి తీసుకుని తుది ఎంపిక చేస్తారు. అర్హత సాధించినవారు అయా ట్రేడుల్లో నెలకు రూ.7,700 నుంచి రూ.8050 వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇతర వివరాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.