AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, వెంకటాపురంలోని భూముల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తించే భూమిని అర్హులైన స్థానిక రైతులకు పంపిణీ చేయాలని, అమరవీరుల కుటుంబాల కోసం ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
M Revanth Reddy Orders Survey, Martyrs Colony, Farmer Distribution
Prabhakar M
| Edited By: |

Updated on: Oct 07, 2026 | 9:02 AM

Share

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం పరిధిలో రికార్డులకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య ఉన్న 45 ఎకరాల భూములపై స్పష్టత తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ భూముల గుర్తింపునకు వెంటనే సర్వే నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులకు సూచించారు. ఎర్రవల్లి గ్రామంలోని సర్వే నంబర్ 325లో రికార్డుల ప్రకారం మొత్తం 388 ఎకరాల భూమి ఉన్నట్లు నమోదై ఉంది. అయితే ఇటీవల నిర్వహించిన పరిశీలనలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రికార్డుల్లో నమోదైన భూమికి, వాస్తవంగా అందుబాటులో ఉన్న భూమికి మధ్య 45 ఎకరాల వ్యత్యాసం ఉన్నట్లు తేలింది.

ఈ అంశంపై ముఖ్యమంత్రి గత నెల 16న శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా విచారణకు ఆదేశించారు. దీనిపై మంగళవారం రాత్రి ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, భూ అక్రమాలపై ఏర్పాటు చేసిన కమిటీ, ధరణి వ్యవహారాలపై విచారణ కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.

కేసీఆర్ కుటుంబ భూముల రికార్డులపై నోటీసులు

సర్వే నంబర్ 325కు సమీపంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన భూములు ఉన్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆయా భూములకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. మిస్సింగ్‌గా ఉన్న 45 ఎకరాల భూమిని సర్వే ద్వారా గుర్తించిన అనంతరం, అందులో అర్హత ఉన్న స్థానిక రైతులకు భూమిని పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు.

అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక కాలనీ

గుర్తించే భూముల్లో తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా ‘తెలంగాణ అమరవీరుల కాలనీ’ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి అవసరమైన మౌలిక సదుపాయాలతో కాలనీని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. కాలనీ నిర్మాణ బాధ్యతలను గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలని, వచ్చే జూన్ 2 నాటికి నిర్మాణం పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు.

వెలికట్టలో ఎడ్యుకేషన్ హబ్

కొండపాక మండలం వెలికట్ట గ్రామ పరిధిలోని భూములపైనా సీఎం కీలక సూచనలు చేశారు. అసైన్డ్ భూములు, మిషన్ భగీరథకు సంబంధించిన భూములను మినహాయించి మిగిలిన భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌తో పాటు ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మల్లన్నసాగర్ నీటిపై నిఘా

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రిజర్వాయర్లు, చెరువుల్లోని నీటిని అత్యంత జాగ్రత్తగా వినియోగించాలని సీఎం అధికారులకు సూచించారు. ముఖ్యంగా మల్లన్నసాగర్ నీటిని అనధికారికంగా వినియోగిస్తున్న వారిని గుర్తించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..