AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: తెలంగాణాలో సీఎం నియోజకవర్గం నుంచి షర్మిల ఓదార్పు యాత్రకు రెడీ. సర్వత్రా ఆసక్తి

YS Sharmila: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం ప్రముఖ రాజకీయ పార్టీల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ఇచ్చిన

YS Sharmila: తెలంగాణాలో సీఎం నియోజకవర్గం నుంచి షర్మిల ఓదార్పు యాత్రకు రెడీ. సర్వత్రా ఆసక్తి
Ys Sharmila
Surya Kala
|

Updated on: Jun 01, 2021 | 9:50 PM

Share

YS Sharmila: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం ప్రముఖ రాజకీయ పార్టీల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల మధ్యకు వెళ్లిన కాంగ్రెస్ సహా టీడీపీ, బీజేపీ వంటి ప్రధాన పార్టీలను ప్రజలు అంతగా ఆదరించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోని టీఆర్ఎస్ కు ప్రజలకు పట్టంగట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ నేతలు టిఆర్ఎస్ వైపు దృష్టి సారించి.. గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీ కరువు అయ్యిందని చెప్పవచ్చు. అయితే దివంగత నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయాలపై దృష్టి సారించింది. రాజ‌న్న రాజ్యమే ల‌క్ష్యంగా ప‌నిచేస్తాన‌ని ప్ర‌క‌టించించింది.

రాష్ట్రంలోని నిరుద్యోగ స‌మ‌స్య‌పై ఫోకస్ పెట్టిన షర్మిల కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో దీక్ష కూడా చేశారు. అప్పుడప్పుడు కరోనా నేపథ్యంలో కూడా ఆస్పత్రుల్లో స్టాఫ్ స‌హా ఉద్యోగాల భ‌ర్తీ సహా నిరుద్యోగ సమస్యపై తెలంగాణ సర్కార్ ను ప్ర‌శ్నిస్తూనే ఉన్నారు.

తాజాగా తెలంగాలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. క‌రోనా కేసుల నమోదు తగ్గుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను ప్రభుత్వం దశలవారీగా ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఈ నేప‌థ్యంలో వైఎస్ ష‌ర్మిల యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్ళకు పైగా అయినా ఉద్యోగాలు ఇక రావ‌న్న బెంగ‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి, ఓదార్చేందుకు ష‌ర్మిల రెడీ అయ్యారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమకు ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూసి.. ఉద్యోగాలు ఇవ్వమని కొట్లాడి.. చివరకు చాలామంది మృతి చెందారని.. అటువంటి బాధిత కుటుంబాలను షర్మిల ప‌రామ‌ర్శించ‌బోతున్న‌ట్లు ష‌ర్మిల అనుచ‌రులు తెలిపారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం నుంచి ఈ యాత్ర చేయ‌నున్నారు. ముందుగా గ‌న్ పార్క్ వ‌ద్ద అమ‌ర‌వీరులకు నివాళి అర్పించి, అక్క‌డి నుండి నేరుగా గ‌జ్వేల్ వెళ్ల‌నున్నారు. సీఎం కేసీఆర్ సొంత నియోజక వర్గం నుంచి షర్మిల పర్యటన చేపట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read: ఏపీ, తెలంగాణ గ్రామీణ డాక్ సేవా ఉద్యోగాల నియామకంపై క్లారిటీ ఇచ్చిన ఇండియన్ పోస్ట్ l

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...