
క్రిస్మస్‌తో పాటు న్యూ ఇయర్, సంక్రాంతి ఒకేసారి వస్తుండటంతో బస్సులు, రైళ్లల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరగనుంది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. ఇప్పటికే వీటిల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. దీనికి తగ్గట్లు రైల్వేశాఖ ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించుకుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిని పెట్టుకుని ముందుగానే తగిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టగా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ప్రజలకు తమ సొంతూళ్లకు వెళ్తాంటారు. దీని వల్ల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిండిపోనుంది. దీనిని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీని అరికట్టేందుకు హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లకు కొత్త స్టాపులు కేటాయించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే మొత్తం 16 రైళ్లు ఇక్కడ ఆగనున్నాయి. నరసాపూర్–లింగంపల్లి, కాకినాడ పోర్ట్–లింగంపల్లి, మచిలీపట్నం–బీదర్, షిరిడీ–మచిలీపట్నం, షిరిడీ–కాకినాడ పోర్ట్, విశాఖపట్నం–ఎల్‌టిటి ముంబై, ఎల్‌టిటి ముంబై–విశాఖపట్నం, లింగంపల్లి–విశాఖపట్నం, కాకినాడ టౌన్–లింగంపల్లి రైళ్లు హైటెక్ సిటీలో కూడా తాత్కాలికంగా ఆగుతాయని రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది. పరిసర ప్రాంతాల్లో నివసించే వారు అక్కడే ట్రైన్లు దిగివచ్చని, అలాగే అక్కడే ఎక్కవచ్చని తెలిపారు. సికింద్రాబాద్ వరకు రావాల్సిన అసవరం లేదని తెలిపింది.
హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో నివసించేవారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాల్సిన అవసరం లేదు. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్‌లోనే ట్రైన్ ఎక్కవచ్చు. సంక్రాంతి పండుగల సమయంలో ఐటీ కారిడార్‌లో నివసించే ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు వెళ్తాంటారు. కంపెనీలకు సెలవులు రావడంతో భారీ సంఖ్యలో ఉద్యోగులు సొంత ప్రాంతాలకు వెళ్తాంటారు. ఇలాంటివారికి ఈ నిర్ణయం వల్ల ఉపశమనం కలగనుంది.