Telangana: తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతీయ పతాకాన్ని తొర్రూరులో ఆవిష్కరించారు.. 100 అడుగుల ఎత్తులో ఎగుర వేసిన జాతీయ జెండాను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు..ఈ సందర్భంగా విద్యార్థులు, గిరిజనులతో మంత్రి ఎర్రబెల్లి డ్యాన్స్‌లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జాతీయ పతాకం హైదరాబాద్ లో ఉంది.. ప్రస్తుతం రెండో అతిపెద్ద జాతీయ పతాకాన్ని పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని తొర్రూరు పట్టణంలో స్థాపించారు.
జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో 100 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ త్రివర్ణ పతాకాన్ని స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆవిష్కరించారు. ఇంతపెద్ద జాతీయ పతాకాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. ఈ సందర్భంగా స్థానిక, విద్యార్థులు, కళాకారులతో కలిసి సంబరంగా డ్యాన్స్‌లు చేశారు. ఈ జాతీయ జెండా 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో రెప రెప లాడుతుంది.. సుమారు 20 లక్షల రూపాయల నిధులతో బారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.. దీని భద్రతా కోసం ఫెన్సింగ్, గార్డెనింగ్, సి.సి కెమెరా ల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు..
తెలంగాణ లో ఇది రెండో అతిపెద్ద జాతీయ పతాకం కాగా…ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం ఇదే ప్రధమం.. దేశానికి స్వాతంత్ర్యం కోసం, ఐక్యత కోసం తన, మన, ధన, ప్రాణత్యాగాలు చేసిన వారందరినీ గుర్తుచేసుకుని వారి త్యాగాల స్ఫూర్తితో నవభారత నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలనే గొప్ప సంకల్పంతో తొర్రూరు లో భారీ జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు మంత్రి ఎర్రబెల్లి.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో అడుగడుగునా దేశభక్తి భావన, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేల్కొలిపే విధంగా సమున్నత స్థాయిలో, అంగరంగ వైభవంగా మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నిర్వహించుకున్నామన్నారు.. ఇప్పటి వరకు దేశంలో అతిపెద్ద జెండా జమ్ము కాశ్మీర్ లో లేహ్ లో వుంది..తెలంగాణ వచ్చాక హైదరాబాద్ లోని సంజీవయ్య పార్కు లో 291 అడుగుల జెండా ను ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఇప్పుడు రాష్ట్రంలో రెండవది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటిది మనం ఏర్పాటు చేసుకోవడం ఆనందదాయకంగా ఉన్నదన్నారు..బారతీయుల ఐక్యతను చాటేవిదంగా ఏర్పాటు చేశారు ఈ జాతీయ పెద్ద జెండా ఆవిష్కరణ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి