SC Railways Alert: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన.. లింగంపల్లి-విజయవాడ, కాచిగూడ-గూంటూరు-రేపల్లే సహా పలు రైళ్ల పునరుద్ధరణ..

|

Jun 17, 2021 | 10:47 AM

SC Railways Alert: కరోనా కారణంగా నిలిపివేసిన పలు రైళ్ల రాకపోకలను దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. పునరుద్ధరించిన...

SC Railways Alert: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన.. లింగంపల్లి-విజయవాడ, కాచిగూడ-గూంటూరు-రేపల్లే సహా పలు రైళ్ల పునరుద్ధరణ..
Scr Trains
Follow us on

SC Railways Alert: కరోనా కారణంగా నిలిపివేసిన పలు రైళ్ల రాకపోకలను దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. పునరుద్ధరించిన లింగంపల్లి-విజయవాడ, కాచిగూడ-గుంటూరు-రేపల్లే, చెన్నై-హైదరాబాద్, హైదరాబాద్-చెన్నై రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లు బుధవారం నుంచి మునుపటిలాగే ప్రయాణిస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు దక్షిన మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం.. కాచిగూడ-గుంటూరు(07252) రైలు మధ్యాహ్నం 3.10గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45కు గుంటూరు చేరుతుంది. అలాగే కాచిగూడ-రేపల్లే డెల్టా ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 10.10గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45కు రేపల్లె చేరుతుంది. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు(02796) లింగంపల్లిలో ఉదయం 4.40కి బయలుదేరి.. 10.30 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. 02795 నెంబర్ రైలు విజయవాడలో సాయంత్రం 5.30 బయలుదేరి రాత్రి 11.20 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది.

అలాగే తుంగభద్ర(07023) రైలు ఉదయం 7.55 గంటలకు కు కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు కర్నూలు చేరుకుంటుంది. హంద్రీనీవ(07027) రైలు కర్నూలులో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి.. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. వీటితో పాటు.. చైన్నై-హైదరాబాద్‌ రైలును కూడా పునరుద్ధరించారు. చెన్నై సెంట్రల్-హైదరాబాద్ రైలు ఈ నెల 17 నుంచి, హైదరాబాద్‌-చెన్నై రైలును ఈ నెల 18 నుంచి పునఃప్రారంభించనున్నట్లు దక్షణి మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. అలాగే 26 ప్రత్యేక రైళ్లను మరికొంతకాలం కొనసాగించాలని దక్షిణ రైల్వే నిర్ణయించింది.

Also read:

Petrol Diesel Price: మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. దేశ వ్యాప్తంగా ఇంధ‌న ధ‌ర‌లు ఇలా..