Telangana: సలామ్ మేడమ్ మీకు.. ఇంత అద్భుతంగా పాఠాలు చెబితే ఏ విద్యార్థి అయినా టాపర్ అవ్వాల్సిందే..!

|

Mar 25, 2023 | 5:05 PM

టీచర్లు క్లాస్‌‌లు చెప్పడం కామన్. స్టీట్ గా చెప్పడం వారి బాధ్యత. పిల్లలకు చదువు చెప్పడం, హోం వర్క్ చేయకుంటే దండించడం వారి విధి. చాలా స్కూలల్లో ఇదే పరిస్థితి. అయితే, టీచర్లు విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉండడం అక్కడక్కడా జరుగుతుంది.

Telangana: సలామ్ మేడమ్ మీకు.. ఇంత అద్భుతంగా పాఠాలు చెబితే ఏ విద్యార్థి అయినా టాపర్ అవ్వాల్సిందే..!
School Teacher
Follow us on

టీచర్లు క్లాస్‌‌లు చెప్పడం కామన్. స్టీట్ గా చెప్పడం వారి బాధ్యత. పిల్లలకు చదువు చెప్పడం, హోం వర్క్ చేయకుంటే దండించడం వారి విధి. చాలా స్కూలల్లో ఇదే పరిస్థితి. అయితే, టీచర్లు విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉండడం అక్కడక్కడా జరుగుతుంది. విద్యార్థులను అర్థం చేసుకొని, వారితో సరదాగా గడపడం వల్ల టీచర్లలో, విద్యార్థుల్లో స్ట్రెస్ కూడా ఉండదు. అచ్చం అలాగే ఆలోచించిన ఒక టీచర్ విద్యార్థులచే టింగ్ టింగ్ టింగ్ పియనో.. టింగ్ టింగ్ టింగ్ పియనో అనే రైమ్స్ చేతులతో స్టెప్ వేస్తూ పిల్లలకు అర్థం అయ్యే విధంగా అద్భుతంగా చెప్పారు ఆ టీచర్. మరి టాలెంటెడ్ టీచర్ ఎవరు? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

స్కూల్లో పాఠాలే కాదు అపుడప్పుడు ఆక్టివిటీతో పాటు పాఠం అర్థం అయేవిధంగా స్టేపులతో చేబ్బితే పిల్లలు ఆనందంగా చదువుతారు.
వనపర్తి జిల్లా అమరచింతలో ప్రైవేట్ స్కూల్ విజేత మోడల్ స్కూల్ లో ఒక టీచర్ సరదాగా పాఠాలు చెబుతున్నారు. రైమ్స్ స్టెప్పులతో చెబుతూ అందరని అకట్టుకుంటున్నారు. తరగతిలో ఒక టీచర్ టింగ్ టింగ్ టింగ్ పియనో అనే పాఠాన్ని విద్యార్థులచే చేతులతో స్టెప్‌లు వేస్తూ వివరిస్తూ ఆహ్లాదకరంగా చెప్పారు. ఇలా చేయడం వల్ల, విద్యార్థుల ఆలోచన సృజనత్మకంగా ఉంటుంది. పిల్లల ఆలోచనలు పక్క దారి పట్టకుండా ఉంటుంది. యాక్షన్ తో చేసి చూపించడం వల్ల పిల్లలు ఇంట్రస్ట్ గా వింటారని టీచర్ రాణి అన్నారు. టీచర్ పిల్లలకు ఈ విధంగా పాఠాలు చెప్పడాన్ని స్కూల్ యాజమాన్యం, విద్యార్థుల తల్లి తండ్రుల అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..