Independence Day 2022: స్వాతంత్ర్య వజ్రోత్సవాలు స్కూళ్లలో డిఫ్రెంట్ వాతావారణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. తమ ప్రతిభకు పదను పెడుతున్న విద్యార్థులు.. జోరుగా వినూత్న జెండాలను సృష్టిస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులన్న స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నారు. జెండా పండుగ అంటేనే విద్యార్థుల పండుగ. వారు లేనిదే ఈ జెండా పండుగకు నిండుదనం ఉండదు. అలాంటిది ఈ స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా జెండా పండుగను స్కూళ్లలో విభిన్నంగా నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న స్కూల్ విద్యార్థులు తమ క్రియేటివిటిని చాటి చెప్పుతున్నారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలన్న స్ఫూర్తిని నింపుతున్నారు.
తాజాగా హైదరాబాద్ తార్నాకలోని స్కూల్ విద్యార్థులు వినూత్నంగా 100 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీగా నిర్వహించారు. మరి కొందరు జెండా విశిష్టతను వివరిస్తూ జనంలో చైతన్యం తీసుకొస్తున్నారు. ఇక పలు జిల్లాల్లో పోలీసుల సహాకరంతోనూ విద్యార్థులు పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాలనీల్లో ర్యాలీలు, వివిధ రకాలైన పోటీలు నిర్వహిస్తూ తమ ప్రతిభను బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరో 25 ఏళ్లకు శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే నాటకి.. ఈ జ్ఞాపకాలు ఉండే విధంగా విద్యార్థులు వినూత్నంగా చేస్తున్నారు. ఈ చిన్న బుర్రలను చూస్తున్న పెద్దలే ముచ్చట పడిపోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..