కరీంనగర్,ఆగస్టు12: సంతోషంగా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రదీప్తి అనే విద్యార్థిని కాలేజీలో జరిగిన ఓ వేడుకలో డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయింది. గంగాధర ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ప్రదీప్తి ప్రెషర్స్ డే వేడుకల్లో ఏకధాటిగా అరగంట పాటు డ్యాన్స్ చేసి కూప్పకూలింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ప్రదీప్తి స్వస్థలం గంగాధర మండలం వెంకటాయపల్లి అని తెలిసింది.
కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో ఇంటర్ చదివే విద్యార్థిని ఫ్రెషర్స్ డే సందర్భంగా అరగంట పాటు ఏకధాటిగా డ్యాన్స్ చేసింది. అనంతరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో గుండెపోటు వచ్చిందని భావించారు. ఈ క్రమంలో విద్యార్థిని ప్రదీప్తికి పాఠశాల సిబ్బంది cpr చేసి వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు మార్గమధ్యంలోనే ఆమె చనిపోయినట్టుగా నిర్ధారించారు.
సంతోషంగా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రదీప్తి అనే విద్యార్థిని కాలేజీలో జరిగిన ఓ వేడుకలో డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయింది. గంగాధర ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ప్రదీప్తి ప్రెషర్స్ డే వేడుకల్లో ఏకధాటిగా అరగంట పాటు డ్యాన్స్ చేసి కూప్పకూలింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ప్రదీప్తి స్వస్థలం గంగాధర మండలం వెంకటాయపల్లి అని తెలిసింది.
కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో ఇంటర్ చదివే విద్యార్థిని ఫ్రెషర్స్ డే సందర్భంగా అరగంట పాటు ఏకధాటిగా డ్యాన్స్ చేసింది. అనంతరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో గుండెపోటు వచ్చిందని భావించారు. ఈ క్రమంలో విద్యార్థిని ప్రదీప్తికి పాఠశాల సిబ్బంది cpr చేసి వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు మార్గమధ్యంలోనే ఆమె చనిపోయినట్టుగా నిర్ధారించారు.
ప్రదీప్తి మృతితో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. అయితే, ఇలాంటి గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గుండెలో రంధ్రం ఉన్న బాధితులు అతిగా వ్యాయామం చేయకూడదని చెబుతున్నారు. అలా చేస్తే ఊపిరితిత్తుల్లో రక్తపోటు రెండు మూడు రెట్లు పెరిగే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. శ్వాసనాళంలో శుభ్రం చేయాల్సిన రక్తం అశుద్ధంగా శరీరంలోకి చేరుతుందని, దాంతో అది అలాగే.. ఊపిరితిత్తలకు చేరుతుందని వివరించారు.. దీని వల్ల అవి తలకిందులుగా పడిపోతాయని చెప్పారు. ఇలాంటి సమయంలో కొంతమంది చనిపోయే ప్రమాదం ఉందన్నారు.. మిగిలిన రెండు రకాల బాధితులకు, విపరీతమైన శారీరక శ్రమ కూడా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. అలాంటి వారికి అత్యవసర సమయంలో చికిత్స ఆలస్యమైతే కనీసం వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ముందుగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు సూచిస్తున్నేరు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..