Independence Day: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న గోల్కొండ కోట.. ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అధికారులు
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గోల్కొండ కోట ముస్తాబవుతుంది ఇప్పటికే గోల్కొండలో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించారు రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్. ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించిన డిజిపి ..గోల్కొండ కోటలో జరుగుతున్న రిహార్ సేల్స్ ను పరిశీలించారు.ఆగస్టు 15న సికింద్రాబాద్లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ గోల్కొండ కోటకు చేరుకుంటారు. అనంతరం గోల్కొండ లోని రాణి మహల్ లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ అధికారులను సూచించారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
