AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆడోళ్లు మీకు జోహార్లు.. రూ. 9కే చీర ఆఫర్.. దెబ్బకు షాప్‌వాళ్లకు దిమ్మతిరిగింది

ఆడవాళ్లకు చీరలంటే ఎంత ప్రాణమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కోసారి చీరలు కొనేందుకు ఇంట్లో పెద్ద పెద్ద యుద్దాలే జరుగుతుంటాయి. ఒక్క చీర కొనేందుకు పొద్దున్నే దుకాణంలోకి పోతే చీకటి పడ్డాకే బైటకు వెళ్తుంటారు. చీర డిజైన్ దగ్గర నుంచి కాకర్ దాకా.. రేటు నుంచి కాస్త బేరసారాలు ఆడేవరకు అన్ని చూసే వెళ్తారు మహిళలు. అలాంటి చీరలు తొమ్మిది రూపాయలకే ఇస్తామంటే.. ఊరుకుంటారా మహిళా లోకం.!

Telangana: ఆడోళ్లు మీకు జోహార్లు.. రూ. 9కే చీర ఆఫర్.. దెబ్బకు షాప్‌వాళ్లకు దిమ్మతిరిగింది
Viral
Ravi Kiran
|

Updated on: Apr 08, 2025 | 12:24 PM

Share

వికారాబాద్ రామయ్యగూడ రోడ్డులో సినిమా నటి అనసూయ, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్‌తో జేఎల్ఎం బట్టల షోరూం అట్టహాసంగా ప్రారంభమైంది. గత నెల రోజులుగా ప్రారంభం రోజున తొమ్మిది రూపాయలకే చీర అంటూ ప్రచారం చేశారు షోరూమ్ యాజమాన్యం. దీంతో ప్రారంభం రోజున షోరూం దగ్గరకు భారీగా మహిళలు చేరుకున్నారు. ఒక్కసారిగా అంతమంది మహిళలు రావడంతో.. వారిని యాజమాన్యం, పోలీసులు సైతం కంట్రోల్ చేయలేకపోయారు. కిక్కిరిసిన జనంతో రామయ్యగూడ-వికారాబాద్ ప్రధాన రోడ్డుపై గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.

గొప్ప ప్రారంభం.. నేడే కొనండి 9 రూపాయలకు ఒక చీర అంటూ విపరీతమైన పబ్లిసిటీతో మహిళలు కట్టలు తెచ్చుకుని భారీగా తరలివచ్చారు. దీంతో వారిని కంట్రోల్ చేయలేక యాజమాన్యం చేతులెత్తేసింది. ఒక దశలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా.. మహిళలందరూ సమయమనం పాటించాలని యాజమాన్యం అందరికీ చీరలు అందిస్తుదని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయినా మహిళలు మాట వినలేదు. ఇక మహిళలందరికీ చీరలు అందజేయలేని పరిస్థితి నెలకొనడంతో.. ఆఖరుకు ప్రారంభం రోజునే షోరూమ్ క్లోజ్ చేసే పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
ఇలా పూజిస్తే చదువుల తల్లి కటాక్షం ఖాయం.. అపార జ్ఞానం మీ సొంతం..
ఇలా పూజిస్తే చదువుల తల్లి కటాక్షం ఖాయం.. అపార జ్ఞానం మీ సొంతం..
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం